మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన హిట్లర్ సినిమా( Hitler movie ) సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.అయితే ఈ సినిమాతో చిరంజీవి హిట్లర్ హిట్ల బాట పట్టాడు.
ఇంకా దీనికి ముందు ఆయన వరుసగా ప్లాప్ సినిమాలను తీస్తూ వచ్చాడు.

ఎప్పుడైతే హిట్లర్ సినిమా సక్సెస్ పడిందో అప్పటినుంచి చిరంజీవి వరుసగా మళ్లీ సక్సెస్ సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు.అయితే ఇదిలా ఉంటే హిట్లర్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) నటించాడు.చిరంజీవి చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకునే క్యారెక్టర్ లో రాజేంద్రప్రసాద్ నటించి తనదైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఆ పాత్ర కోసం మొదట చిరంజీవి వేరే హీరోని తీసుకుందామని అనుకున్నాడంట.కానీ ఆ హీరో నో చెప్పడంతో రాజేంద్రప్రసాద్ ను తీసుకున్నారట…ఈ పాత్రను రిజెక్ట్ చేసిన నటుడు ఎవరు అంటే అప్పట్లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన జగపతిబాబు.
( Jagapathi Babu ) ఈ సినిమాలో జగపతిబాబు ని నటింపజేయాలని చిరంజీవి ప్రయత్నం చేసినప్పటికీ అది మాత్రం వర్కౌట్ అవలేదు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటించిన పాత్ర కీలకమైంది కావడం ఆయన ఆ పాత్ర లో అద్భుతంగా నటించడంతో ఈ సినిమాకి ఆయన చాలా వరకు ప్లస్ అయ్యాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాతో తన ఖాతాలో ఇక సక్సెస్ ను వేసుకున్నాడు అనే చెప్పాలి.ఇక ఈ సినిమా తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి అన్నయ్య అనే మరొక సినిమా చేశాడు.
ఈ సినిమాతో కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాడు.ఇక రెండు సక్సెస్ లు వచ్చిన వీళ్ళ కాంబో లో మరొక సినిమా వస్తుందని అందరు అనుకున్నారు.
కానీ వీళ్ళ కాంబో లో మరో సినిమా అయితే రాలేదు…
.