Re-Release Movies Collections : తెలుగు లో రీ రిలీజ్ సినిమాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టిన స్టార్ హీరో ఎవరంటే..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ లా హవా నడుస్తుంది.అయితే కొన్ని సినిమాలు మొదటిసారి రిలీజ్ చేసినప్పుడు పెద్దగా సక్సెస్ సాధించడం లేదు.

కానీ రీ రిలీజ్ చేసినప్పుడు మాత్రం భారీ సక్సెస్ లను సాధిస్తున్నాయి.ఇక గత నెలలో వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఓయ్ సినిమాకి( Oye Movie ) ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అయితే వచ్చింది.

మొదటిసారి రీ రిలీజ్ చేసినప్పుడు పెద్దగా సక్సెస్ దక్కకపోయిన కూడా ఇప్పుడు ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులందరూ ఇంట్రెస్ట్ చూపించారు.

ఇక అందులో భాగంగానే ఈ సినిమా రీ రిలీజ్ లో సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే ఎంత మంది హీరోల సినిమాలు రీ రిలీజ్ అయిన కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి ఉన్న రేంజ్ మరొక హీరోకి ఉండదనే చెప్పాలి.ఇక అందుకే గత సంవత్సరం నుంచి రీ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఖుషి సినిమా( Kushi Movie ) భారీ కలెక్షన్స్ ను వసూలు చేసి నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.

Advertisement

ఇక ఖుషి సినిమా రీ రిలీజ్ లో 12 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి రీ రిలీజ్ లో కూడా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది.అందుకే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాని బీట్ చేయడం ఇప్పుడున్న హీరోలా వల్ల కాదు అనేది మరొకసారి ప్రూవ్ అయింది.

ఇక రీసెంట్ గా రామ్ చరణ్( Ram Charan ) హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా( Orange Movie ) కూడా రీ రిలీజ్ అయింది.ఈ సినిమా దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.మిగతా హీరోల సినిమాలు ఏవి కూడా అంత పెద్దగా కలెక్షన్స్ అయితే రాబట్టే లేకపోతున్నాయి.

ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమాను రీ రిలీజ్ చేసినా కూడా ఒకటికి పది సార్లు చూస్తూ ఆ సినిమాను సూపర్ హిట్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు.

మహేష్ బాబు సినిమాను తక్కువ అంచనా వేసిన స్టార్ ప్రొడ్యూసర్...
Advertisement

తాజా వార్తలు