పాన్ ఇండియా హీరోల్లో స్టార్ హీరో ఎవరు..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు స్టార్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇక వీళ్ళ ఆరుగురు మీదనే ఇండస్ట్రీ మొత్తం డిపెండ్ అయి ఉంది అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎందుకంటే వీళ్లు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అందుకే వీళ్ళ సినిమాకోసం ఇప్పుడు టోటల్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది.

ఇక ఇప్పటికే దేవర పుష్ప 2( pushap 2 ) లాంటి సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి.ఇప్పటికే సలార్ ( Salar ) సినిమాతో పాన్ ఇండియాలో ఒక భారీ సక్సెస్ ని అందుకున్న ప్రభాస్ తదుపరి రాజాసాబ్, కల్కి ( Rajasab, Kalki )లాంటి సినిమాలు తో మరొకసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు.ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా లో తన సత్తా ఏంటో చూపించబోతున్నాడు.

అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ పాన్ ఇండియాలో ఎవరు స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నారు అనే విషయం మీద ఇప్పుడు చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి.నిజానికి మన స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు.

Advertisement

అయినప్పటికీ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను అలాగే కలెక్షన్స్ ని అందుకున్న హీరోగా ప్రభాస్( Prabhas ) అయితే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఎందుకంటే ఇప్పటికే ఆయన చేసిన బాహుబలి, బాహుబలి 2 , సాహో, రాధేశ్యామ్, ఆది పురుషు, సలార్ లాంటి సినిమాలు వరుసగా 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి.కాబట్టి ఇలాంటి క్రమంలో ప్రభాస్ ఇప్పుడు తెలుగు నుంచి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు