సౌత్ లో రీమేక్స్ చేయడంలో ఎవరు నంబర్ వన్ హీరో ?

సౌత్ భాషల్లో ఒక సినిమా హిట్ అయింది అంటే దానిని తీసుకెళ్లి హిందీలో రీమేక్ చేసుకోవడం ఎప్పటినుంచో జరుగుతుంది.ఎలాగో వాళ్లకు కథలు రాసే టేస్ట్ లేదు కాబట్టి ఇలా రీమేక్ చేసుకుంటూ ఉంటారు ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల కాలంలో మన సౌత్ సినిమాలనే మనం రీమేక్ చేస్తూ బాలీవుడ్ తో పోటీకి దిగాం.

 Who Is The South Indian Number One Remake Hero ,south Indian , Remake, Rajinika-TeluguStop.com

అసలు తెలుగులో కూడా కథలు రాయించుకోవడం ఎవరికి సరిగా రావడం లేదు ఆ టేస్ట్ కూడా ఉండడం లేదు అందుకే సినిమాను డబ్బులు పెట్టి మరీ కొనుక్కొని ఎక్కడలేని బిల్డప్పులు అద్ది అదే సినిమాని ఏళ్లకు ఏళ్ళు తీస్తూ బడ్జెట్ పెంచుతూ చివరికి ఫ్లాప్ సినిమా గా నిలబెడుతున్నాం.అలా సౌత్ లో ఏ హీరో ఎక్కువ రీమేక్ సినిమాలో నటించాడో తెలుసుకుందాం.

రజినీకాంత్

Telugu Balakrishna, Chiarnajeevi, Kamal Haasan, Mammootty, Mohanlal, Nagarjuna,

రజనీ తన కెరీర్ మొత్తంలో 60 రీమిక్స్ సినిమాల్లో నటించాడు తలైవాగా పిలుచుకునే రజిని పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లడానికి ఇష్టపడడు తన మూస కథల్లో తానే కొట్టుకుంటూ వెళ్తున్నాడు.

కమల్ హాసన్

Telugu Balakrishna, Chiarnajeevi, Kamal Haasan, Mammootty, Mohanlal, Nagarjuna,

కమల్ హాసన్ ఎంతో అద్భుతమైన నటుడు.రజినీకాంత్ తో సమానంగా 60 రీమేక్ సినిమాల్లో నటించాడు కానీ రజనీ తో పోలిస్తే కమల్ హాసన్ చాలా బెటర్.ఎందుకంటే కమల్ హాసన్ ప్రయోగాలు చేసి ఆ సినిమాను అద్భుతమైన చిత్రంగా నిలబెట్టడానికి ప్రయత్నించాడు.

చిరంజీవి

Telugu Balakrishna, Chiarnajeevi, Kamal Haasan, Mammootty, Mohanlal, Nagarjuna,

ఇప్పటికే 153 పైగా సినిమాలు తీసిన చిరంజీవి అందులో 38 సినిమాలు రీమేక్ చిత్రాలు.అయితే స్టోరీ లైన్ అలాగే ఉంచి చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా 90% మార్పులు చేస్తూ సినిమాను విడుదల చేస్తూ ఉంటాడు చిరు.

మోహన్ లాల్

Telugu Balakrishna, Chiarnajeevi, Kamal Haasan, Mammootty, Mohanlal, Nagarjuna,

బేసిగ్గా మలయాళం లో కథలు చాలా స్ట్రాంగ్ అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది.అక్కడి కథలను మిగతా భాషల హీరోలు కొనుక్కొని వెళుతుంటారు.మలయాళంలో వచ్చిన ఒరిజినల్ కథలను రీమేక్ గా అనేక భాషలో తీస్తూ ఉంటారు.తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు తీయడమే మలయాళీల స్పెషాలిటీ.అలాంటిది ఈ మోహన్లాల్ తీసిన 350 చిత్రాల్లో 34 రీమేక్ సినిమాలు కావడం విశేషం.

వెంకటేష్

వెంకటేష్ పేరు చెప్పగానే రీమేక్ హీరో అని అంటూ ఉంటారు.చిరంజీవితో పోలిస్తే వెంకటేష్ తీసినది సినిమాలే తక్కువ.దాదాపు 70 సినిమాల వరకు మాత్రమే తీసిన వెంకటేష్ అందులో 32 రీమేక్ సినిమాలు తీశాడు.

శివ రాజ్ కుమార్

కన్నడ హీరో రాజ్ కుమార్ కుమారుడైన శివన్న దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు.అందులో 28 రీమేక్ చిత్రాల్లో నటించాడు.35 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న శివన్న బయటకు పెద్దగా ఇన్నాళ్లపాటు కనిపించలేదు.

ఉపేంద్ర

తెలుగువారికి ఎప్పటినుంచో పరిచయమున నటుడు ఉపేంద్ర.ఇతడు ఇప్పటివరకు కేవలం 27 రీమేక్ సినిమాల్లో మాత్రమే నటించాడు.ఉపేంద్ర నటుడు మాత్రమే కాదు దర్శకుడుగా కూడా పని చేశాడు.

మమ్ముట్టి

Telugu Balakrishna, Chiarnajeevi, Kamal Haasan, Mammootty, Mohanlal, Nagarjuna,

మన సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యంత ఎక్కువ సినిమాలు తీసిన నటుడు మమ్ముట్టి.ఇప్పటివరకు దాదాపు 400 సినిమాలకు పైగా నటించాడు.ఇందులో అతడు చేసిన రీమేకుల సంఖ్య చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే.ఇన్ని సినిమాల్లో మమ్ముట్టి చేసింది కేవలం 26 రీమేకులు మాత్రమే అవి కూడా సౌత్ లోనివి కాదు ప్రపంచ దేశాల చిత్రాలు కావడం విశేషం.

నాగార్జున

అక్కినేని నాగార్జున ప్రస్తుతం సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నాడు కెరియర్ బిగినింగ్ లో ఎక్కువ రీమేక్ సినిమాల్లోనే నటించాడు మందకు పైగా సినిమాల్లో నటించినా నాగార్జున కేవలం 20+ రీమేక్ చిత్రాల్లోనే కనిపించాడు.

బాలకృష్ణ

ఇక అగ్ర హీరోలు అందరితో పోలిస్తే బాలకృష్ణ చేస్తారు రీమేకులు చాలా తక్కువ.107 కి పైగా సినిమాలు చేసిన బాలయ్య కేవలం 17 రీమిక్స్ సినిమాల్లో మాత్రమే కనిపించాడు.బాలయ్య బాబు కోసం కథలను ఎప్పుడు తెలుగులోనే సిద్ధం చేస్తూ ఉంటారు మన రచయితలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube