సౌత్ లో నుంచి వచ్చే డైరెక్టర్లలో నెంబర్ వన్ ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇండస్ట్రీ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు హీరోగా ఎంట్రీ ఇస్తే స్టార్ హీరో గా అవ్వాలని, డైరెక్టర్ గా ఎంటర్ అయితే టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.

అందుకే ఇక్కడ హీరోల మధ్య గాని డైరెక్టర్ల మధ్య గాని విపరీతమైన పోటీ ఉంటుంది.

ఇప్పటికే రాజమౌళి ( Rajamouli )పాన్ వరల్డ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నప్పటికీ సుకుమార్ లాంటి వాళ్ళు పాన్ ఇండియా డైరెక్టర్లు గా గుర్తింపు పొందుతున్నారు.

ఇంకా ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు కూడా ప్లాన్ ఇండియా సినిమాలను చేస్తూ పాన్ ఇండియా డైరెక్టర్( Pan India Director ) గా గుర్తింపు పొందడానికి రెడీ అవుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలో మన వాళ్ళు ఎంచుకునే సబ్జెక్టులు పాన్ ఇండియా ని బేస్ చేసుకొని ఉండే విధంగా రాసుకుంటున్నారు ముఖ్యంగా సినిమా బాగుండి దాని మేకింగ్ గనక బాగున్నట్టయితే సినిమా ఏ లాంగ్వేజ్ లో వచ్చిన కూడా సూపర్ హిట్ అవుతుంది అని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి.రాజమౌళి తీసిన విక్రమార్కుడు( Vikramarkudu ) సినిమా దాదాపు 8 భాషల్లో రీమేక్ అయి అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది.

అలా ఒక స్టోరీలో దమ్ముంటే సినిమా అనేది ఆటోమేటిక్ గా నిలబడుతుంది.సౌత్ నుంచి వచ్చే డైరెక్టర్లలో పాన్ ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్లుగా పోటీ పడుతున్న వాళ్లలో రాజమౌళి ని పక్కన పెడితే సుకుమార్, లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లకు సంబంధించిన అన్ని సినిమాలు 2024 లో రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి.

Advertisement

కాబట్టి పాన్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనేది తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి.ఎవరి సినిమాలు ఎక్కువ కలెక్షన్లను వసూలు చేస్తాయో వల్లే నెంబర్ వన్ డైరెక్టర్ గా నిలవడం ఖాయం.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు