తెలుగు లో అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Director Sandeep Reddy Vanga ).ఈ సినిమాతో ఈయన టాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు…ఇక ఈ సినిమా ను బాలీవుడ్ ( Bollywood )లో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రణబీర్ కపూర్ హీరో గా ఎనిమల్ అనే సినిమాని తీస్తున్నాడు… ఈ సినిమా ఆగష్టు 11 వ తేదీన విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ టీజర్ ని నిన్న విడుదల చేసారు.
మెయిన్ టీజర్ ని మరో రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.నిన్న విడుదల చేసిన ప్రీ టీజర్ కి మంచి స్పందన వచ్చింది.

ఇందులో రణబీర్ కపూర్ ని మోస్ట్ వైలెంట్ గా చూపించబోతున్నాడు సందీప్… ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది.‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో సూపర్ హిట్ ని అందుకొని తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన రణబీర్ కపూర్ ఇప్పుడు ‘ఎనిమల్’ చిత్రం తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు.తెలుగు తో పాటుగా తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుంది.

ఇక ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది, అది ఏమిటంటే ఈ సినిమాని తొలుత సందీప్ రెడ్డి సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యాలి అనుకున్నాడట.కానీ మహేష్ బాబు( Mahesh Babu ) ఈ చిత్రం లో వైలెన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం తో సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదట.అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత మొట్టమొదట సందీప్ రెడ్డి వంగ కలిసింది సూపర్ స్టార్ మహేష్ బాబు ని మాత్రమే.
ఆయన తో సినిమా చెయ్యాలి అనేది సందీప్ రెడ్డి వంగ కోరిక,ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక రీసెంట్ గా విడుదలైన ప్రీ టీజర్ ని చూసిన తర్వాత అయ్యో ఇలాంటి సినిమా మిస్ అయ్యాం అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
ఇక ఈ సినిమా కాకపోయినా భవిష్యతులో అయినా మహేష్ బాబు తో సినిమా చేస్తే చాలు అని కోరుకుంటున్నారు.ఎనిమల్ చిత్రాన్ని వదులుకున్న తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు…








