లీక్ వీరులెవరు.. లిక్కర్ వీరులెవరు ?

తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ బీజేపీ( BJP ) మద్య జరుగుతున్నా రాజకీయ రగడ రోజురోజుకు మరింత ముదురుతోంది.

ఇరు పార్టీల మద్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న రాజకీయ వివాదం రసవత్తరంగా మారుతోంది.

ఇక ఇరు పార్టీల మద్య నేతలు విసురుకునే సవాళ్ళు .ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు వేస్తున్న వ్యూహాలు ఇలా అన్నీ కూడా హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.లిక్కర్ స్కామ్ తో బి‌ఆర్‌ఎస్ (Brs )కు బీజేపీ షాక్ ఇస్తే.

ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంతో బీజేపీకి షాక్ ఇచ్చింది బి‌ఆర్‌ఎస్.ఇక నెక్స్ట్ బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.

కాగా టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో ఇటీవల అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్( BJP chief Bandi Sanjay ) తాజాగా బెయిల్ పై బయటకు వచ్చారు.బయటకు వచ్చిన ఆయన కే‌సి‌ఆర్ సర్కార్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ.అతి త్వరలోనే ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ), మంత్రి కే‌టి‌ఆర్ కూడా జైలు కు వెళ్ళేందుకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

తాగుబోతుల చేతులో రాష్ట్రం ఉందని చెబుతూ.బి‌ఆర్‌ఎస్ లోనే లీక్ వీరులు, లిక్కర్ వీరులు ఇద్దరు ఉన్నారని ఎద్దేవా చేశారు బండి సంజయ్.ఇక రేపు ( ఏప్రెల్ 7 ) ప్రధాని మోడి తెలంగాణకు వస్తుండడంతో బీజేపీ సత్తా చూపించబోతున్నామని చెప్పుకొచ్చారు బండి సంజయ్.

ఇదిలా ఉంచితే బి‌ఆర్‌ఎస్ కు లిక్కర్ స్కామ్ ద్వారా చెక్ పెట్టె ప్రయత్నం చేసింది కేంద్ర బీజేపీ.

కే‌సి‌ఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అనుమానితురాలుగా ఇప్పటికే రెండు మూడు సార్లు ఈడీ విచారణకు కూడా హాజరు అయ్యారు.అయితే 20న జరిగిన విచారణ తరువాత ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒక్కసారిగై సైలెంట్ అయింది.ఈ లిక్కర్ స్కామ్ లో కవితా పేరు వచ్చినది మొదలు అప్పటినుంచి కవితా జైలుకు వెళ్ళడం ఖాయం అని కమలనాథులు తరచూ చెబుతూనే ఉన్నారు.

అయితే ఈ లిక్కర్ స్కామ్ లో కవిత కేవలం అనుమానితురాలా అని నిందితురాలా అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.ఇదిలా కొనసాగుతుండగానే ప్రశ్నపత్రాల లీకేజ్ లో బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?

ఈ లీకేజ్ వ్యవహారంలో కే‌సి‌ఆర్ కావాలనే తనను ఇరికిండాని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ప్రశ్నించినందుకే తనను జైలు కు పంపారని బండి సంజయ్ చెబుతున్నారు.దీంతో ప్రశ్న పత్రాల లీకేజ్ లో కూడా అసలు నిందితులు ఎవరనేది ప్రశ్నార్థకంగానే ఉంది.

Advertisement

మరి లీకేజ్ వీరులెవరో.లిక్కర్ వీరులెవరో అనే దానిపై ఎప్పుడు స్పష్టత వస్తుందో చూడాలి.

తాజా వార్తలు