మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.నెల్లూరు జిల్లాకు చెందిన ఈ యువనేత.
తొలి విడత మంత్రివర్గంలో ధీటైన నేతగా ప్రతిపక్షం… జనసేనపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.అధినేత జగన్ ను విమర్శించాలంటే ముందు తనను దాటుకొని వెళ్లాలనేంతగా ఫైర్ అయ్యేవారు.
దీంతో జగన్ వద్ద మంచి మార్కులు సాధించారు.అయితే కొన్ని సామాజిక సమీకరణల వల్ల అనిల్ కి మంత్రి పదవి రెండో సారి దక్కలేదు.
ఇక నెల్లూరు అంటే రెడ్డి.రెడ్డి అంటే నెల్లూరు అన్నట్లు ఉంటుంది.
అయితే నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన మేకపాటి గౌతం రెడ్డి చనిపోయిన తర్వాత కేవలం అనిల్ కుమార్ యాదవ్ ని కంటిన్యూ చేస్తే అసలుకే మోసం వస్తుంది అని అతన్ని తప్పించారన్న వాదన ఉంది.
ఇక నెల్లూరు పట్టణంలో చూస్తే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుటుంబానికి పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు.
మరో వైపు జిల్లా మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.కాబట్టి అతనికి కూడా అనుచరులు ఉన్నారు.ఈ క్రమంలోనే అనిల్ కుమార్ కి తన సొంత నియోజకవర్గంలో పోటీ తప్పదు.ఎందుకంటే బలమైన నేతలు ఉన్న వైసీపీలో అనిల్ కి అంతా తానే అనుకునేంత సీన్ అయితే ఉండదు.
అయితే అనిల్ మాత్రం తాను మాజీ మంత్రిగా ఉన్నా దూకుడు అయితే తగ్గించడంలేదు.బాహాటంగానే సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవుతున్నారు.
జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో గుర్రుగా ఉన్నారు.అలాగే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఒకప్పుడు సన్నిహితంగా ఉన్న అనిల్ ఇపుడు ఆయననే ప్రత్యర్థిగా చూస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యలో అనిల్ కి తన నియోజకవర్గంలో ఇబ్బందులు తప్పవనే అంటున్నారు.అలాగే మంత్రిగా పనిచేసిన తీరును కూడా పరిగణలోకి తీసుకుంటారు.మంత్రిగా ఉన్నప్పుడు బాగానే హవా చూపించారు.కానీ ఇప్పుడు పరిస్థితి అప్పటిలా ఉండదు కదా.మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని బహాటంగా విమర్శలు చేయకుండా రాజకీయంగా సత్తా చాటాలే కానీ.ఇలా స్టేట్ మెంట్లు ఇస్తే ఎలా అంటున్నారు.
తనను టార్గెట్ చేస్తున్నారని భావించి బయట పెట్టుకుంటే నష్టపోయేది తానేనని అంటున్నారు.అందుకు తాజాగా అనిల్ మాట్లాడిన మాటలే అంటున్నారు.
సొంత పార్టీలోనే వెన్నుపోటు.!!

తనకు సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారని.తనను వెన్నుపోటు పొడుస్తున్నారని అనిల్ అనడం ఇప్పుడు వైసీపీలో చర్చ సాగుతోంది.రాజకీయాల్లో తనను తాను కాపాడుకునేందుకు చూడాలి తప్పా మీడియా ముందు బయటపెట్టుకుంటే ఒరిగేది ఏమీ ఉండదని అంటున్నారు.
ఇక వైసీపీలో ఉన్న ఒక నాయకుడు నీతి మరచి సిగ్గుమాలిన పనులు చేస్తున్నారని ఆరోపించడం రాజకీయంగా ప్రకంపనలకు దారితీస్తోంది.ఇక తమ పార్టీలోని వారే టీడీపీ వారితో కలసి తన మీద దాడి చేస్తున్నారని చెప్పడం గమన్హరం.
అయితే వారు ఎవరో హై కమాండ్ కి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి కానీ .బయట పెట్టుకుంటే తనకే నష్టం అని అంటున్నారు.అంతే కాకుండా తనను వెన్నుపోటు పెడిచే వారి కాల్ డేతాతో పాటు మొత్తం జాబితా అంతా భద్రంగా ఆధారాలతో సహా ఉందని అంటున్నారు.ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు హై కమాండ్ వద్దే తేల్చుకోవచ్చు కదా అంటున్నారు.
ఇక పార్టీలో పోటీ ఉండటం సాధారణం అంతమాత్రాన వర్గపోరుకు తెరలేపితే.పార్టీ నష్టపోతుంది.
పార్టీ నష్టపోతే అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.అంతే కాకుండా తన వ్యవహారశైలి కూడా సమీక్షించుకోవాలి కదా అని సూచనలు ఇస్తున్నారు.
మొత్తానికి అనిల్ ఎలా పరిష్కరించుకుంటాడో చూడాలి మరి.