తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్ ప్రొఫైల్ తో సంభందం లేకుండా టాలెంట్ ఉంటె చాలు ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చే ఒకే ఒక్క హీరో రవితేజ ఈయన సినిమాలని చూస్తే మనకి అర్థం అవుతుంది ఆయన ఎలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు అనేది, రీసెంట్ గా ధమాకా సినిమాతో త్రినాథరావు నక్కిన గారికి డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు.ఆయన ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు.
అయితే ఈ సినిమా కి ముందు ఈ డైరెక్టర్ ఏ పెద్ద హీరో తో కూడా వర్క్ చేయలేదు కానీ ఆయన చెప్పిన కథ నచ్చడంతో త్రినాథ్ రావు గారికి అవకాశం ఇచ్చారు రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా త్రినాథ్ రావు మంచి సినిమా తీసి హిట్ కొట్టి చూపించాడు.
ఇప్పుడు ఈ క్రమం లోనే ఇంకో కుర్ర డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నాడు రవి తేజ ఆ డైరెక్టర్ ఎవరంటే నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య సినిమా తీసిన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది ఒక హాలీవుడ్ సినిమాకి రీమేక్ గా రాబోతున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ న్యూస్ బయటకి వచ్చిన క్రమంలో రవితేజ అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే ఏ కొత్త డైరెక్టర్ కి అయిన, చిన్న డైరెక్టర్ కి అయిన, ప్లాప్ ల్లో ఉన్న డైరెక్టర్ కి అయిన మొదట గుర్తుకు వచ్చే పేరు రవితేజ నే… అందుకే రవితేజ చాలా ఉన్నతమైన హీరో అంటూ ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు…