నాగచైతన్య( Naga Chaitanya ) అంటే ఇండస్ట్రీ లో లవ్ స్టోరీస్ తీసే హీరోగా అందరిలో ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు.అలాంటి నాగ చైతన్య కెరియర్ లో అనుకోని మలుపులు జరిగాయి.
ప్రస్తుతం ఆయన లైఫ్ లో అటు సినిమా కెరియర్ ప్లాప్ ల్లో ఉంది, ఇటు పర్సనల్ లైఫ్ కూడా అంత ఆశ జనకం గా లేదు అనే చెప్పాలి ఎందుకంటే ఆయన ఎంతో ఇష్టపడి లవ్ చేసి మరీ సమంతను( Samantha ) పెళ్లి చేసుకున్నారు అయిన కూడా ఆయన లైఫ్ లో పెద్దగా సంతోషపడింది లేదు అనే చెప్పాలి.
ఎందుకంటే సమంత ని పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే వాళ్ల మధ్య తలెత్తిన కొన్ని విభేదాల వల్ల వాళ్లిద్దరి వైవాహిక జీవితం మధ్యలోనే బ్రేక్ అయిందనే చెప్పాలి…ప్రస్తుతం ఇద్దరు ఒకరి నుంచి ఒకరు విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు.ఇద్దరు కూడా సినిమాలు చేస్తూ మంచి బిజీ గా ఉన్నారు.ఇక ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తన కో ఆర్టిస్ట్ అయిన శోబిత దూళిపాళ్లతో( Shobitha dulipalla ) కొంచం చనువుగా ఉంటున్నట్టు తెలుస్తుంది.
ఈ మధ్య జరిగిన ఒక ఫంక్షన్ లో కూడా ఇద్దరు కలిసి కనిపించారు దాంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి.
హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ రూమర్స్ పై నాగచైతన్య కూడా గతంలోనే స్పందించారు.ఓ ఇంటర్వ్యూలో శోభిత పేరు వినగానే మీకుగుర్తొచ్చేది ఏది అంటూ అడిగిన ప్రశ్న కు చిరునవ్వు అంటూ ఫన్నీగా ఆన్సర్ చెప్పాడు ఆ పేరు వినగానే తన పెదాలపై నవ్వు ప్రత్యక్షమవుతుందని, అంతకుమించి మరేం గుర్తురాదంటూ పేర్కొన్నాడు…ప్రస్తుతం నాగ చైతన్య వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు…
.