ప్రతి సందర్భంలోనూ తమను రాజకీయంగా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని విమర్శలతో విరిచిపడుతూ వస్తున్న గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నానిని( Kodali Nani ) వచ్చే ఎన్నికల్లో ఏదో రకంగా ఓడించాలనే పట్టుదలతో టిడిపి అధిష్టానం ఉంది.నాని మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని టార్గెట్ పెట్టుకుంది.
అందుకే గుడివాడలో నానికి ప్రత్యర్థిగా బలమైన నాయకుడిని పోటీకి దింపాలని చూస్తోంది.కానీ నానికి ధీటైన నాయకుడిని ఎంపిక చేసే విషయంలో తర్జన భర్జన పడుతోంది.
ఇప్పటికే అనేకమంది పేర్లను పరిగణలోకి తీసుకున్నా, బహిరంగంగా మాత్రం ఎవరి పేరును ప్రకటించలేని పరిస్థితి నెలకొంది.అందుకే ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ నియామకాన్ని వాయిదా వేస్తూ వస్తోంది.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా, ఈ నియోజకవర్గ ఇన్చార్జిని ఇప్పటివరకు నియమించకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

గుడివాడలో టిడిపి గెలవడం ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం.మఖ్యంగా చంద్రబాబు( N Chandrababu Naidu ) ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఈ నియోజకవర్గంలో టిడిపి జెండా ఎదురువేయాలనే పట్టుదలతో ఉండడంతో, నానికి ప్రత్యర్థిని ఎంపిక చేసే బాధ్యత కష్టంగా మారింది.2019 ఎన్నికల్లో నానికి ప్రత్యర్ధి గా ఆర్థికంగా బలంగా ఉన్న విజయవాడ నేత దేవినేని అవినాష్ ను పోటీకి దించినా, భారీగా సొమ్ములు ఖర్చుపెట్టినా, కొడాలి నాని విజయాన్ని ఆపలేకపోయారు.ఎన్నికల తర్వాత దేవినేని అవినాష్ కూడా వైసీపీలోకి వెళ్లడంతో , మళ్లీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు కు పార్టీ బాధ్యతలను అప్పగించారు.కానీ నానిని ఎదుర్కోవడంలో రావి వెంకటేశ్వరావు దూకుడు ప్రదర్శించకపోవడంతో ఎన్నారై వెనిగండ్ల రాముకు గుడివాడ బాధ్యతలు అప్పగించాలని సంభావిస్తోంది.
అయితే రాముకు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఇప్పటివరకు పార్టీకి విధేయుడుగా ఉన్న రావి వెంకటేశ్వరరావు అసంతృప్తి కి గురవుతారని , ఇక్కడ రెండు గ్రూపులుగా పార్టీ విడిపోతుంది అని టిడిపి ఈ విషయంలో ఎటు ముందుకు వెళ్లలేకపోతోంది.

2019 ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తే ఓడించి చూపిస్తానని రావి అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించారట.అయితే ఆర్థికంగా స్థితిమంతుడైన వెనిగండ్ల రామును( Venigandla Ramu )పోటీకి దించితేనే నాని ఓటమి సాధ్యమవుతుందని టిడిపి అంచనా వేస్తోంది.ఈ విషయంలో రావి వెంకటేశ్వరావును ఒప్పించేందుకు ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఆఫర్ చేశారట .కానీ రావి వెంకటేశ్వరరావు మాత్రం అసెంబ్లీ టికెట్ ఫెయిని ఆశలు పెట్టుకోవడంతో అధినేతకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.