ప్రస్తుత కాలంలో మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు అధికంగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.మనం ఏమాత్రం అమాయకంగా కనిపించిన మనల్ని మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.
ఇక ఇండస్ట్రీలో అయితే ఇలాంటి మోసాలకు అడ్డు అదుపు లేదని చెప్పాలి ఎంతోమంది సరైన సమయానికి రెమ్యూనరేషన్లు అందుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు కోకోల్లల్లుగా ఉన్నారు.కాస్త ఏమరపాటుగా ఉంటే స్టార్ హీరోలకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్లలో కూడా కోత విధించిన నిర్మాతలు ఎంతోమందే ఉన్నారని చెప్పాలి.
ఇలా మోసపోయిన వారిలో డైరెక్టర్ గోపిచంద్ కూడా ఉన్నారని తాజాగా ఈయన వెల్లడించారు.

డైరెక్టర్ గోపీచంద్ బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇలా ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ పాస్టర్ హిట్ అందుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక డైరెక్టర్ సైతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గోపిచంద్ కి ఒక ప్రశ్న ఎదురయింది.

ఈయన రవితేజ హీరోగా చేసిన క్రాక్ సినిమా ఎలాంటి హిట్ అయిందో మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాకు గాను నిర్మాతలు తనకు రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని విన్నాము ఎంతవరకు నిజం అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు గోపీచంద్ సమాధానం చెబుతూ ఇప్పటివరకు తాను తీసిన ఏ సినిమాకి కూడా పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదని ఎవరు కూడా నాకు పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.తాను ఏ సినిమాకైనా పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నాను అంటే అది కేవలం వీరసింహారెడ్డి సినిమాకి మాత్రమేనని ఈ సినిమా కోసం మైత్రివారు తనకు పూర్తిస్థాయి రెమ్యూనరేషన్ ఇచ్చారంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







