బాబోయ్: కరోనా ను అంతం చేసే ఔషధమే లేదంటున్న WHO

ఒకపక్క ప్రపంచ దేశాలు ఈ కరోనా మహమ్మారిని అంతం చేయాలి అని అహర్నిశలు పరిశోధనలు చేసి ఒక వ్యాక్సిన్ ను కనిపెట్టే పనుల్లో బిజీ బిజీ గా గడుపుతున్నారు.

ఈ వ్యాక్సిన్ తో పూర్తిగా కాకపోయినా ఎదో ఒక మోస్తారుగా జనాలు కొందరైనా కోలుకుంటారు అని అందరూ భావిస్తున్న ఈ సమయం లో WHO ఒక పిడుగులాంటి వార్త చెప్పింది.

అదే ఈ మహమ్మారిని అంతం చేసే ఔషధం లేదంటూ తాజాగా వెల్లడించింది.ఈ మహమ్మారికి జనాలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి తప్ప ఈ వైరస్ ను పూర్తి గా అంతం చేసే ఔషధం మాత్రం లేదంటూ స్పష్టం చేసింది.

స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ ఎల్లప్పుడూ చేతులు శుభ్రముగా కడుక్కోవడం అలానే భౌతిక దూరం పాటించడం తో పాటు మాస్క్ లు ధరించడం వంటి చర్యలపై దృష్టి పెట్టాలి అంటూ ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రిసియస్‌ కూడా ఈ అంశం పై మాట్లాడుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారికి ఇప్పటికిప్పుడు అంతం చేసే ఎలాంటి చికిత్స అయితే లేదు కానీ భవిష్యత్తు లో కూడా ఈ వైరస్ కు అంతం అనేది ఉండకపోవచ్చు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే జంతువుల నుంచి ఈ మహమ్మారి సోకుతుంది అని అధ్యయనాల్లో వెల్లడైన నేపథ్యంలో అసలు ఈ వైరస్ మనుషుల్లోకి ఎలా ప్రవేశించింది అన్న దానిపై WHO తీవ్ర కసరత్తులు చేస్తుంది.

Advertisement

ఇప్పటికే దీనిపై ఒక స్పష్టత తీసుకోవడం కోసం చైనా కు ఈ సంస్థ ప్రతినిధులను పంపించి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ మహమ్మారి ఎలా మనుషుల్లోకి ప్రవేశించింది అన్న దానిపై చైనా పరిశోధకులతో పాటు ఈ సంస్థ కూడా కలిసి పని చేయనున్నట్లు తెలుస్తుంది.

వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు