సోషల్ మీడియాలో కొంచెం ఆసక్తిగా ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.ఎందుకంటే నేడు దాదాపుగా అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ కొలువుదీరి వుంది.
ఈ మధ్య కాలంలో చూసుకుంటే జంతువులకు( animals ) సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూశాం.తాజాగా రెండు ఎద్దులకు సంబందించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఆ వీడియోని చూసిన నెటిజనం అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ( Sambhal district of Uttar Pradesh )ఓ ప్రాంతం నిర్మానుష్యంగా వుంది.అది బాటసారులు వెళ్ళే వీధి అయినప్పటికీ సరిగా మధ్యాహ్నవేళ కావడం చేత జనాలు రద్దీ చాలా తక్కువగా వుంది.సరిగా అదే సమయంలో రెండు ఎద్దులకు మరి ఏం గొడవ వచ్చిందో తెలియదు గానీ, ఒక్కసారిగా ఒకదానితో ఒకటి నువ్వా నేనా అన్న మాదిరి తలపడ్డాయి.
ఎద్దుల పోట్లాటను అడ్డుకునేందు ఇద్దరు పోలీసులు ప్రయత్నించడంతో అవి వారిపైకే దూసుకు వచ్చిన పరిస్థితి వచ్చింది.దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ వైరల్ ఆ రెండు ఎద్దులు కొమ్ములతో పొట్లాడుకోవడంతో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు.అయితే అవి అలా రోడ్డు మీద గందరగోళం సృస్టిస్తే పోలీసులు చూస్తూ వూరుకోరు కదా.అందుకే ఆ పక్కనే ఉన్న పోలీసులు బారికేడ్ లతో వాటిని నియంత్రించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తారు.దీంతో అప్పటివరకూ భీకరంగా పొట్లాడుకుంటున్న ఆ 2 ఎద్దుల్లో ఒకటి.
పోలీసుల మీదకు దూసుకువచ్చింది.ఈ ప్రాణాంతక దాడి నుంచి తృటిలో తప్పించుకుని పోలీసులు అక్కడ్నుంచి ఒక్క ఉదుటున పారిపోయారు.
కాగా ఈ సరదా సరదా వీడియోని చూసి నెటిజనం అయితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.ఈ క్రమంలో కొందరు “పోలీసులు ప్రతాపం మనుషుల పైనే.
జంతువులను వారు ఏమి పీకలేరు.” అంటూ కాస్త కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.