ఐపీఎల్ ( IPL )లో రోజుకొక టీమ్ భారీ ట్విస్ట్ లు ఇస్తు మంచి విజయాలను నమోదు చేసుకుంటున్నాయి.ఇక ఈరోజు జరగబోయే లక్నో సూపర్ జాయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Lucknow Super Joints vs Chennai Super Kings )జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయాన్ని సాధిస్తారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది.
ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ టీం లో ఇప్పటికే చాలా బలమైన ప్లేయర్లు ఉన్నారు.అలాగే వాళ్ళు మంచి ఫామ్ లో ఉండటం కూడా ఆ టీమ్ కి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.
ఇక బ్యాటింగ్ లో అయితే ఋతురాజ్ గైక్వాడ్, రహానే, శివం దూబే, ధోని ( Rituraj Gaikwad, Rahane, Shivam Dubey, Dhoni )లాంటి ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉండడం ఈ టీమ్ కి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.

ఇక ఇప్పుడు ఈ టీమ్ ని ఓడించాలి అంటే మిగతా జట్ల కి సాధ్యమయ్యే పని అయితే కాదు.ఇక లక్నో సూపర్ జాయింట్స్ టీం కూడా చాలా వరకు మంచి పోటీనిస్తూ ముందుకు సాగుతుంది.అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ టీం తో పోల్చుకుంటే ఈ టీం అంత స్ట్రాంగ్ గా అయితే లేదు.
ఇక ఈ టీంలో కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, డికాక్ ( KL Rahul, Nicholas Pooran, De Kock )లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతవరకు రానిస్తారో అనేది ఇక్కడ కీలకమైన అంశంగా మారింది.ఒక మ్యాచ్ ను గెలవాలంటే టీంలో ఉన్న 11మంది ప్లేయర్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇవ్వాలి కానీ లక్నో టీంలో మాత్రం అది జరగడం లేదు.
అందువల్లే వాళ్ళు కొన్ని మ్యాచ్ లను ఓడిపోతూ కొన్ని గెలుస్తూ వస్తున్నారు.కృణాల్ పాండ్య ఆల్ రౌండర్ షో మాత్రం ఇవ్వడం లేదు.ఇక తను ఎంతసేపు బౌలింగ్ లో సక్సెస్ అయితే బ్యాటింగ్ లో ఫెయిల్ అవుతున్నాడు.బ్యాటింగ్ లో ఫెయిల్ అయితే బౌలింగ్ లో సక్సెస్ అవుతున్నాడు.

తను కనక రెండింటిని సమపాలల్లో అడగలిగితే ఈ టీమ్ విజయం లో తను కూడా కీలకపాత్ర వహించిన వాడు అవుతాడు.ఇక ఇది ఇలా ఉంటే డికాక్ మొదట్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ, గత రెండు మూడు మ్యాచ్ ల నుంచి ఆయన వరుసగా తడబడుతున్నాడు.ఆయన కనక విజృంభించి ఆడితే ఈ టీం ని ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్ కావడం విశేషం.ఇక ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి 70% గెలిచే అవకాశం ఉంటే, లక్నో కి కేవలం 30% మాత్రమే గెలిచే అవకాశం ఉంది…