పొంగులేటి ఊరింపులు.. ఆశల పల్లకిలో రెండు పార్టీలు

ఖమ్మం జిల్లా రాజకీయ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్నాడు.వైకాపా తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన బీఆర్ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యాడు.

 Which Party Isponguleti Srinivasa Reddy Jupalli Going To Join? ,ponguleti Sriniv-TeluguStop.com

కానీ ఆ పార్టీ దూరం పెట్టడం తో గత కొన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగా పరిస్థితి ఉంది.ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ( BRS party ) నుండి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది.

ఆయన తో పాటు జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) కూడా పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు.

Telugu Congress, Etela Rajender, Jupallykrishna, Khammam, Telugu, Ts, Ysrcp-Telu

దాంతో ఇద్దరు ఏ పార్టీ లో జాయిన్ అవ్వబోతున్నారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆ మధ్య కాంగ్రెస్ లో పొంగులేటి జాయిన్ అవుతాడు అంటూ ప్రచారం జరిగింది.కానీ తాజాగా బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులు వెళ్లి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని సంప్రదించడం జరిగింది.

తమ పార్టీ లో జాయిన్ అయితే ప్రముఖ స్థానం కల్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చారట.

Telugu Congress, Etela Rajender, Jupallykrishna, Khammam, Telugu, Ts, Ysrcp-Telu

ఖమ్మం జిల్లా మొత్తం కూడా అభ్యర్థుల ఎంపిక విషయం లో పూర్తి స్వేచ్ఛ ఇస్తామని కూడా ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.కానీ ఇప్పటి వరకు పొంగులేటి మరియు జూపల్లి ఏ పార్టీ లో జాయిన్ అయ్యే విషయమై ఒక స్పష్టత ఇవ్వలేదు.కాంగ్రెస్, బిజెపి మరియు షర్మిల పార్టీల్లో వారు చేరుతారా లేదంటే కొత్త పార్టీని పెడతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu Congress, Etela Rajender, Jupallykrishna, Khammam, Telugu, Ts, Ysrcp-Telu

మొత్తానికి వీరిద్దరి చేరిక తో కచ్చితంగా ఆ పార్టీ బలోపేతం అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.ఖమ్మం జిల్లా మొత్తం కూడా క్లీన్ స్వీప్‌ చేస్తానంటూ ధీమా తో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కూడా ఓడించేందుకు సిద్ధమన్నట్లుగా చెప్పుకొచ్చాడు.బీఆర్‌ఎస్‌ పై ఇంత వ్యతిరేకంగా ఉన్న నాయకుడు తమ పార్టీ లో ఉంటే తమకు అంటే తమకు బలం అన్నట్లుగా బీజేపీ మరియు కాంగ్రెస్ లు భావిస్తున్నాయి.అందుకే ఆయన్ను ఆహ్వానిస్తూ ఆశల పల్లకిలో రెండు పార్టీలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube