రాత్రివేళ ఇవి తింటే లాభం కన్నా నష్టమే ఎక్కువ‌ట‌!

రాత్రివేళ మితంగా ఆహారం తీసుకోవాల‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు.కానీ, ఏ ఏ ఆహారాలు రాత్రివేళ తీసుకోకూడ‌దు అన్న విష‌యంపై చాలా మందికి అవ‌గాహ‌న ఉండ‌దు.

దీంతో ఏది ప‌డితే అది తినేస్తారు.ఫ‌లితంగా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు.

అయితే వాస్త‌వానికి కొన్ని కొన్ని ఆహారాల‌ను రాత్రివేళ అస్స‌లు తీసుకోరాదు.మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా చాలా మందికి రాత్రి ప‌డుకునే ముందు పాలు తాగే అల‌వాటు ఉంటుంది.కొవ్వు తీసిన‌ పాలు తాగితే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.

Advertisement

కానీ, కొవ్వు తీయ‌ని పాలు తాగ‌డం వ‌ల్ల మాత్రం అవి జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది.దీని వ‌ల్ల ఒక్కోసారి గుండెలో మంటగా కూడా అనిపిస్తుంది.

అలాగే మాంసాహారానికి రాత్రి వేళ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ఎందుకంటే, రాత్రి వేళ మాంసాహారం తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

ఇక కొంద‌రు రాత్రివేళ నట్స్ తింటుంటారు.కానీ, రాత్రుళ్లు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండ‌వు.దాంతో రాత్రివేళ న‌ట్స్ తీసుకుంటే అవి కొవ్వుగా మార‌తాయి.

అందుకే న‌ట్స్‌ను ఉద‌యం పూట తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.అలాగే ఆకుకూర‌లు ఆరోగ్యానికి మంచిదే.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

అయిన‌ప్ప‌టికీ, రాత్రి వేళ మాత్రం వీటిని తీసుకుంటే జీర్ణం కష్టం అవుతుంది.అదేవిధంగా, నీరు ఎంత తాగితే అంత ఆరోగ్యంగా ఉండొచ్చు కానీ, రాత్రివేళ నీరు ఎక్కువ‌గా తీసుకుంటే కడుపునిండుగా ఉన్నట్లు అనిపించి మాటమాటికీ మూత్ర విసర్జనుకు వెళ్లాల్సి వ‌స్తుంది.

Advertisement

పండ్లు, ఫ్రూట్ జ్యూస్ లు తీసుకోవ‌డం వ‌ల్ల ఇదే ప‌రిస్థితి వ‌స్తుంది.కాబ‌ట్టి, రాత్రి వేళ వీటికి కూడా దూరంగా ఉండాలి.

ఇక వీటితో పాటుగా షుగ‌ర్ ఫుడ్స్‌, టీ, కాఫీ, నూడిల్స్‌, స్పైసీ ఫుడ్స్, డార్క్ చాక్లెట్స్, ఐస్ క్రీములు, ఫ్రైడ్ ఫుడ్ వంటివి కూడా రాత్రివేళ తీసుకోరాదు.

తాజా వార్తలు