ఇండియా తర్వాత ఏ దేశంలో ఎక్కువమంది భారతీయులు ఉన్నారో తెలుసా..

భారతదేశం( India ) నుంచి చాలా మంది ప్రజలు మెరుగైన ఉద్యోగాలు, విద్య లేదా లైఫ్ స్టైల్ వంటి వివిధ కారణాల వల్ల ఇతర దేశాలకు వలస వెళ్లారు.

ఇప్పటికీ వెళ్తూనే ఉన్నారు.

వారిలో కొందరు కొత్త దేశాల పౌరులుగా కూడా మారారు, అక్కడే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ కూడా స్టార్ట్ చేశారు.గత సంవత్సరం నాటికి దాదాపు 1.42 బిలియన్ల ప్రజలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.ఇంతకు ముందు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాను( China ) అధిగమించింది.

అయితే భారతదేశం తర్వాత అత్యధిక సంఖ్యలో భారతీయులు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా? భారతీయులు అనేక రంగాలలో, దేశాలలో విజయం, గుర్తింపును సాధించారు.వారు సైన్స్, టెక్నాలజీ, క్రీడలు, వినోదం వంటి రంగాలలో ఎంతో సహకారం అందించారు.

ఇండియా తర్వాత భారతీయులు ఎక్కువగా నివసించేది మరే దేశమో కాదు మనందరికీ బాగా తెలిసిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA).కొన్ని నివేదికల ప్రకారం, ఈ దేశంలో నివసించే భారతీయులలో కొందరు ఇప్పటికీ ఇండియన్ సిటిజెన్లుగా( Indian Citizens ) ఉండగా మిగతావారు భారత పౌరసత్వాన్ని వదులుకొని యూఎస్ సిటిజన్‌షిప్ పొందారు.

Advertisement

భారతదేశం తర్వాత ఏ దేశంలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారనే ప్రశ్నను తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ కొరాలో అడిగారు.

అత్యధిక భారతీయులు ఉన్న దేశం USA అని కొరా వినియోగదారు ఒకరు తెలిపారు.అక్కడ దాదాపు 44 లక్షల భారతీయులు నివసిస్తున్నారని ఆయన చెప్పారు.31 లక్షల (3.1 మిలియన్లు) భారతీయులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,( UAE ) 29 లక్షల భారతీయులతో మలేషియా( Malaysia ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని కూడా ఆయన చెప్పారు.పాకిస్తాన్‌లో( Pakistan ) కూడా చాలా మంది భారతీయులు నివసిస్తున్నారని మరో కొరా వినియోగదారు తెలిపారు.

అయితే, వీరు చెప్పిన సంఖ్య ఖచ్చితం అని చెప్పలేము.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ 2023, అక్టోబర్‌లో ఒక నివేదికను ప్రచురించింది, ఇది వివిధ దేశాలలో భారతీయుల సంఖ్యను చూపుతుంది.ఈ నివేదిక ప్రకారం, యూఎస్ఎలో అత్యధికంగా భారతీయులు ఉన్నారు, ఈ దేశంలో 12,80,000 మంది ఎన్నారైలు,( NRIs ) 31,80,000 పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, 44,60,000 విదేశీ భారతీయులు ఉన్నారు.మొత్తంగా, యూఎస్ఎలో నివసిస్తున్న, పని చేసే లేదా చదువుతున్న భారతీయులు 89 లక్షల కంటే ఎక్కువ ఉన్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు