Salim Baig : రఘువరన్ ని మైమరిపించే విలన్ అవుతాడు అనుకున్న ఈ నటుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ?

పాండా బాయ్… ఈ పేరు మీలో ఎంత మందికి గుర్తుంది.ఈ పేరుతో ఘర్షణ సినిమా లో( Gharshana Movie ) విలన్ క్యారెక్టర్ ఉంటుంది.

 Where Is Gharshana Movie Salim Baig-TeluguStop.com

ఈ సినిమా చాలా బాగా పాపులర్ అయింది.అయితే ఈ సినిమాలో పాండా భాయ్ పాత్రలో నటించింది నటుడు కూడా అందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటాడు.దాదాపు ఈ సినిమా వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్న ఇప్పటికే ఎవరు మర్చిపోలేదు.2004లో వచ్చిన ఘర్షణ సినిమాలో పాండా భాయ్ పేరుతో మొట్టమొదటిసారి ఫుల్ లెన్త్ విలన్ రోల్ లో( Villain Role ) కనిపించాడు.ఇక ఈ నటుడు పేరు సలీం బైగ్.( Salim Baig ) మొట్టమొదటిగా 2004 లోనే జై సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.కొన్నాళ్ల పాటు తెలుగులోనే నటించాడు.ఆ తర్వాత తమిళ్లో కూడా బాగానే కనిపించాడు.

ఇటీవల కాలంలో హిందీ సినిమాల్లో కూడా మెరుస్తున్నాడు.

Telugu Salim Baig, Gharshana, Gharshanasalim, Panda Bhai Role, Radhe, Raghuvaran

అయితే చాలా గొప్ప నటుడిగా కాకపోయినా అందరికి మంచి పాత్రలు చేస్తూ నటుడుగా అయినా ఉంటాడు అనుకుంటే ఈ మధ్యకాలంలో సలీం ఎక్కడ కనిపించడం లేదు.తను చివరిగా నటించిన సినిమా 2021 లో ఆరడుగుల బుల్లెట్.( Aaradugula Bullet ) గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమాలో ఒక చిన్న పాత్రలో చేశాడు.

ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు.హిందీలోనూ పాపులర్ అవ్వాలని అక్కడే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు.

ఘర్షణ సినిమా సమయంలో 20 ఏళ్ల కింద వచ్చిన సినిమా కాబట్టి అప్పుడు చాలా యంగ్ గా ఉన్నా సలీం ఇప్పుడు గుర్తుపట్టకుండా మారిపోయాడు.ఇప్పుడు చూస్తే అతడు ఇతడేనా అని చాలా మందికి అనుమానం వస్తుంది.

Telugu Salim Baig, Gharshana, Gharshanasalim, Panda Bhai Role, Radhe, Raghuvaran

ప్రస్తుతం బాలీవుడ్ లోనే( Bollywood ) ఎక్కువగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.సల్మాన్ ఖాన్ తో సైతం ఇటీవల రాధే( Radhe ) అనే ఓ చిత్రంలో నటించాడు.దానికన్నా ముందు గన్స్ ఆఫ్ బనారస్ చిత్రంలో కూడా మెరిసాడు.సల్మాన్ ఖాన్( Salman Khan ) తరచుగా ఇతడికి అవకాశాలు ఇస్తున్నాడు.బాడీగార్డ్ చిత్రంలో కూడా సల్మాన్ సరసన నటించాడు.రఘువరన్( Raghuvaran ) లాగా ఒక స్టార్ విలన్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ ఆ రేంజ్ లో పాపులర్ అవ్వక కాస్త వెనక్కి తగ్గాడు.

ఇక ఘర్షణ చిత్రంలో అయితే అతడి వాయిస్ లో గౌతమ్ మీనన్ గొంతు అద్భుతంగా పండింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube