తెలుగు టీవీ సీరియల్ లా మహారాష్ట్ర సంక్షోభం..

వారం క్రితం ప్రారంభమైన మహారాష్ట్రా రాజకీయ సంక్షోభం తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది.

ఇంకా ఎన్ని రోజులకు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే సంక్షోభం మొదలైన తర్వాత ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు ఇష్టం వచ్చినట్లుగా తీసుకుంటోంది.గడచిన మూడు రోజుల్లోనే 443 జీవోలు జారీ చేసి, నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.

వీటి గురించి వివరాలు పంపించాలని రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం.మరోవైపు శివసేనలోని తిరుగుబాటు వర్గం థాక్రే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు గవర్నర్ కు లేఖ ద్వారా తెలిపింది.

అదేవిధంగా తమ బలాన్ని నిరూపించుకోవడానికి గవర్నర్ దగ్గరకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.అంతకుముందు ఫ్లోర్ టెస్ట్ కు ఓకే అంటేనే ముంబై వస్తామని తిరుగుబాటు వర్గం నేత ఏక్ నాథ్ షిండే చెప్పారు.

Advertisement

ఇదిలా ఉంటే బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు.పార్టీ పెద్దల ఆదేశం మేరకు ఆయన హస్తిన వెళ్ళారు.

షిండే బల నిరూపణకు ముంబై రావడానికి సిద్ధం కావడంతో, బీజేపీ తదుపరి చర్యలకు రెడీ అవుతున్నట్లు సమాచారం.షిండే గవర్నర్ ముందు బల నిరూపణ చేసి, ప్రభుత్వం మైనారిటీలో పడిందని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు.

అదే జరిగితే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పతనం కాక తప్పదు.ఆ తర్వాత గవర్నర్ తీసుకునే నిర్ణయం కీలకం అవుతుంది.

తెలుగు టీవీ సీరియల్ లా మహారాష్ట్ర సంక్షోభం కొనసాగుతుంది.మూడు రోజుల్లోనే 443 నిర్ణయాలు తీసుకున్నారు.సంక్షోభం తర్వాత తీసుకున్న నిర్ణయాలపై గవర్నర్ ఆరా తియనున్నారు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

నిర్ణయాల వివరాలు పంపాలని ప్రభుత్వానికి ఆదేశించింది.మా ప్రభుత్వానికి ఢోకా లేదని సంజయ్ రౌత్ అన్నారు.

Advertisement

పలువురు ఎమ్మెల్యేలు టచ్ లోనే ఉన్నారని తెలిపారు.ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తానంటేనే ముంబై వస్తామని షిండే చేప్పారు.

ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు గవర్నర్ కు వివరించడానికి షిండే ప్రయత్నిస్తున్నారు.

తాజా వార్తలు