ప్రముఖ స్మార్ట్ ఫోన్లో తయారీ సంస్థ వివో నుంచి వివో V30e స్మార్ట్ ఫోన్ ( Vivo V30e )అద్భుతమైన ఫీచర్లతో మే రెండవ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ కానుంది.ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అద్భుతమైన కొన్ని ఫీచర్లను టీజర్ పేజ్ ద్వారా కంపెనీ వెల్లడించింది.
ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
వివో V30e స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్ 3D కర్వ్డ్ డిస్ ప్లే( Ultra Slim 3D Curved Display ) తో వస్తోంది.ఈ ఫోన్ స్క్రీన్ చాలా వైబ్రాంట్ గా ఉండడంతో పాటు ఎక్కువగా వంగిన అంచులను కలిగి ఉంటుంది.ఈ ఫోన్ సెంటర్-పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది.
ఈ ఫోన్ 5500mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 4-year బ్యాటరీ హెల్త్ కలిగి ఉంటుంది.ఈ ఫోన్ అత్యంత సన్నగా ఉండడంతో పాటు ఈ కేటగిరిలో భారత్ లోనే ఇదే మొదటి ఫోన్ గా నిలుస్తుంది.
ఈ ఫోన్ స్టూడియో క్వాలిటీ Aura light portrait తో మంచి కెమెరా సెటప్ తో ఉంటుంది.ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ తో 50ఎంపీ సోనీ IMX882 ప్రధాన సెన్సార్ 50mm ఫోకాల్ లెన్త్ తో DSLR లాంటి డీటెయిల్స్ ఉండే ఫోటోలు అందిస్తుంది.ఈ ఫోన్ 50ఎంపీ Eye AF సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.ఇక ఈ ఫోన్లో ఉండే మెయిన్ కెమెరాతో వెడ్డింగ్ స్టైల్ portrait ఫోటోలను పొందవచ్చు.ఈ ఫోన్ కు సంబంధించిన స్టోరేజ్, ధర వివరాలతో పాటు మిగిలిన ఫీచర్ వివరాలను కంపెనీ లాంచింగ్ సమయంలో వెల్లడించనుంది.