స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా భాష పండితులు ఉన్నత పాఠశాలలో పనిచేయాలి.కానీ ఎస్ జి టి కేడర్ గా ప్రభుత్వం గుర్తించి, జీతభత్యాలు కూడా అంతే ఇస్తుంది.
పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఉదయం, సాయంకాలం నిర్వహిస్తూ శని ,ఆదివారాలలో కూడా స్కూల్ అసిస్టెంట్ల వారితో సమానంగా విధులు నిర్వహిస్తున్న ,కేవలం హైయర్ క్లాస్ అలవెంట్స్ 150 రూపాయలు మాత్రం ఇవ్వడం భాషా పండితులను ముమ్మాటికీ అవమానించడమే .ఏ సబ్జెక్టుకు లేనటువంటి మినహాయింపు కేవలం భాషా పండితుల పట్ల మాత్రమే వివక్ష చూపించడం మాతృభాషను చిన్నచూపు చూడడమే.స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ లాంగ్వేజ్ పండిట్ తెలుగు, హిందీ ఈ రెండు పోస్టులకు డిగ్రీ మరియు పండిత శిక్షణ కానీ నియామకాలు మాత్రం ఎస్ జి టి కి సమానమైన లాంగ్వేజ్ పండితులుగా నియమిస్తున్నారు.భాషా పండితుల సమస్యను ఏ నాయకులు పట్టించుకోకపోగా కేవలం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కర్రీలో కరివేపాకు లాగా భాషా పండితుల ఓట్ల కోసం పదోన్నతుల విషయం తెరపైకి తీసుకురావడం ఆనవాయితిగా మారింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పనికి తగిన వేతనం ఇవ్వాలి.కాని భాషా పండితులకు.
పి.ఈ.టి లకు వర్తించ లేదు.ఉన్నత పాఠశాలలో పని చేస్తూ ప్రాధమిక పాఠశాల జీతాలు తీసుకుంటూ వెట్టి చాకిరికి గురౌతున్నారు.
మిగతా ఉద్యోగుల ముందు చులకనగా చూడబడుతున్నారు.ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న భాషా పండితులకు .,పి.ఈ.టి లకు మూడు దశాబ్దాలుగా పదోన్నతులు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇది ముమ్మాటికీ పండితుల పట్ల సవతి ప్రేమ.
భాషా పండితులకు గౌరవంగా పదోన్నతులు ఇస్తామని ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రపంచ తెలుగు ప్రతినిధుల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.అయినప్పటికి పదోన్నతులు రాలేదు.
గ్రాడ్యూయేట్., టీచర్ల శాసనమండలి ఎన్నికల ముందు భాషా పండితులకు పదోన్నతులు ఇవ్వనున్నట్లు హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం జీ.వో లు విడుదల చేసింది.అన్ని ప్రముఖ పత్రికలలో భాషాపండితుల పదోన్నతులు అనే శీర్షికతో పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించబడ్డాయి కాని అసలు విషయానికి వస్తే ఆశలన్నీ అడియాశలు అయినవి.
ప్రాథమిక పాఠశాల జీతాలు తీసుకుంటూ శ్రమ దోపిడికి గురౌతున్నారు.షా పండితులుగా ఉద్యోగంలో చేరి భాషా పండితులుగా పదవీ విరమణ చేస్తున్నారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి తగిన వేతనం ఇవ్వాలి.కాని భాషా పండితులకు.
,పి.ఈ.టి లకు ఉన్నత పాఠశాలలో పని చేస్తూ ప్రాధమిక పాఠశాల జీతాలు తీసుకుంటూ వెట్టి చాకిరికి గురౌతున్నారు.భాషా పండితుల దగ్గర చదువుకున్న వారు స్కూల్ అసిస్టెంట్లుగా.
, ప్రధానోపాధ్యాయులుగా., విద్యాశాఖ పర్యవేక్షణ అధికారులుగా వస్తున్న , భాషా పండితులకు మాత్రం పదోన్నతులు లేనే లేవు.

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం ఒక ఉద్యోగం లో చేరిన వారికి కనీసం మూడు పదోన్నతులు ఇవ్వాలి అని ఉంది.ఆచరణలో భాషా పండితుల విషయం లో ఒక్క పదోన్నతి రావడం లేదు.తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులకు మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించి జీ.వో.10.11 విడుదల చేసింది.ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన అమలు కాని భాషా పండితుల., పి.ఈ.టిల పదోన్నతులు జీ.వో లు వచ్చిన పదోన్నతులకు నోచుకోని భాషా పండితులు.భాషా పండితులకు మూడు సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు గడిచినా పదోన్నతులు రావడం లేదు.
భాషా పండితుల జీతాలు స్కూల్ అసిస్టెంట్ జీతాలు దగ్గర లోనే ఉన్నాయి.ఆర్థికంగ కాకుండా ఆత్మగౌరవం కోసం పదోన్నతులు అడుగుతున్నారు.ఎస్జీటీ లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇవ్వాలి.మాతృభాష అభిమానులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్జీటీ లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇస్తామని ప్రకటించారు.
వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ మొదలు పెట్టాలి.ఉపాధ్యాయులకు పదోన్నతులు.
, బదిలీలు చేయాలి.తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతో కాలంగా పదోన్నతులు.
, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు.బదిలీలు.
, పదోన్నతులకు మార్గదర్శకాలు విడుదల చేయాలి.భాషా పండితుల కల సాకారం చేయాలి.
భాషా పండితులకు సరైన విధంగా పదోన్నతులతో గౌరవం ఇచ్చినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం చూపించినట్లు అవుతుంది.