ప్రపంచ సోషల్ మెసేజింగ్ దిగ్గజం WhatsApp తన వినియోగదారులకోసం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తెస్తూ పోతోంది.తాజాగా ఆన్‌లైన్ స్టేటస్ ని దాచడానికి అనుమతించే ఓ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను విడుదల చేసి యూజర్లకు శుభవార్తను అందజేసింది.తాజా సమాచారం ప్రకారం, వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.22.20.9 వెర్షన్‌లో కొంతమంది బీటా టెస్టర్‌లకు హైడ్ ఆన్‌లైన్ స్టేటస్ ఫీచర్ అందుబాటులోనే ఉంది.ఈ ఫీచర్ పేరుకు తగినట్లుగానే, వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడకుండా నియంత్రించవచ్చు.అంతే మీరు ఆన్లైన్ లో ఉన్నట్లు వారికి తెలియదన్నమాట.
ముఖ్యంగా, ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది ఎంపిక చేసిన బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండటం కొసమెరుపు.హైడ్ ఆన్‌లైన్ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు.
బహుశా ఇప్పటి నుండి మరో 1-2 నెలల లో ఇది అందుబాటులోకి రావొచ్చు.అదనంగా, వాట్సాప్ వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి అనేక ఇతర ఫీచర్లపై పనిచేస్తోంది.
మీ WhatsApp మెసేజ్ లు ఎవరు Screenshot తీసుకోకుండా, కొత్త ఫీచర్ ను కూడా తీసుకువస్తోంది.

మరీ ముఖ్యంగా ‘View Once’ మెసేజ్ లను స్క్రీన్‌షాట్ తీయడాన్ని ఈ ఫీచర్ నిరోధిస్తుంది.ఇక ఈ తాజా ఫీచర్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది.లేదంటే ఇప్పుడే తెలుసుకోండి.
ఇది కూడా ఇటీవలే వచ్చింది.నిన్న మొన్నటి వరకు వాట్సాప్ ఓపెన్ చేయగానే పైన చాట్స్, స్టేటస్, కాల్స్ అనే మూడు ఆప్షన్స్ కనిపించేవి.
కానీ ఇప్పుడు వాటికి తోడుగా కెమెరా ఐకాన్ కనిపిస్తోంది.ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి.
మీకు కనబడుతుంది.ఈ కెమెరా ఐకాన్‌ను క్లిక్ చేయగానే వెంటనే కెమెరా ఓపెన్ అవుతోంది.
దీంతో ఫొటోను క్లిక్ మనిపించి మీకు నచ్చిన వారికి మెసేజ్ చేయడమో లేదా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.