స్మార్ట్‌ఫోన్ యూజర్లంతా వాట్సాప్ వినియోగించకుండా ఉండరు.అంతలా మన జీవితంలో భాగమైంది సోషల్ మీడియా ప్లాట్‌ఫాం.
కొంతమందైతే గంటల తరబడి వాట్సాప్ లోనే మునిగి తేలుతుంటారు.ఇక ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ లతో ఆకట్టుకుంటుంది వాట్సాప్.
తాజాగా 10 ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.వీటిని మొదటగా బీటా టెస్టర్లలో ప్రయోగాలు చేస్తారు.
విజయవంతమైతే ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ డివైజ్ లలో వీటిని ప్రవేశపెడతారు.మీరు కూడా వాట్సాప్ బీటా ప్రోగ్రామ్స్‌లో ఉన్నట్లయితే ఆ కొత్త ఫీచర్లను వాడి చూడొచ్చు.
త్వరలో రానున్న ఆ కొత్త ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
గ్రూప్ అడ్మిన్స్ వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా, ఏదైనా మెసేజ్ పెడితే దానిని పెట్టిన వారే డిలీట్ చేసే ఆప్షన్ మాత్రమే ప్రస్తుతం ఉంది.ఇక కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే, గ్రూప్ అడ్మిన్లు కూడా ఆయా మెసేజ్‌లను తొలగించే వీలుంటుంది.2-స్టెప్ వెరిఫికేషన్ వాట్సప్ డెస్క్‌టాప్, వెబ్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేలా సరికొత్త ఫీచర్ రానుంది.
ఇక నుంచి ఎవరైనా వాట్సాప్ వెబ్ ద్వారా డెస్క్ టాప్ పై లాగిన్ కావాలంటే అందుకు రెండు సార్లు వెరిఫికేషన్ అవ్వాల్సి ఉంటుంది.

ఫోన్‌కు వచ్చే కోడ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.మెసేజ్ రియాక్షన్స్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లలో ఎవరైనా మెసేజ్‌కు రియాక్షన్ రూపంలో రెస్పాండ్ అవ్వొచ్చు.
సాధ్యమైనంత త్వరలోనే ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
వచ్చిన ఏ మెసేజ్‌కైనా రియాక్షన్ రూపంలో రిప్లై ఇవ్వొచ్చు.యానిమేటెడ్ ఎమోజీస్ సాధారణంగా ఎరుపు రంగులో ఉండే హార్ట్ సింబల్‌ను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు.
అందులోనూ యానిమేటెడ్ సింబల్స్ అంటే ఇష్టపడని వారుండరు.రెడ్ హార్ట్‌కు యానిమేషన్ జోడించి, మరిన్ని ఎమోజీలను అందుబాటులో తీసుకురానున్నారు.

కమ్యూనిటీస్ గ్రూపులను వినియోగించే క్రమంలో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ క్రమంలో కమ్యూనిటీ ఫీచర్ ద్వారా గ్రూప్ ను పర్యవేక్షించొచ్చు.సబ్ గ్రూపుల్లోనూ పటిష్టమైన ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానం ఉంటుంది.వాట్సాప్ స్టేటస్‌ను ఎవరెవరు చూడొచ్చో ప్రైవసీ సెట్టింగ్స్ ద్వారా మనం ఎంచుకోవచ్చు.దీనిని మరింత అభివృద్ధి చేసి స్టేటస్‌లను ఎవరెవరూ చూడాలో సెట్టింగ్స్ మార్చొచ్చు.