స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్( Whatsapp ) ఉపయోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందింది.
వినియోగదారులకు సౌకర్యాలు సులభతరం చేసేందుకు, భద్రతకు రక్షణ కల్పించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను, సెక్యూరిటీ ఆప్షన్లను తీసుకువస్తూనే ఉంది.వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లను తెస్తూ ఉన్న కూడా కొన్ని తాత్కాలిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ ను అధికంగా ఉపయోగించే వారిని మోసం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఒక బగ్( Whatsapp Bug ) వాట్సప్ ఉపయోగించే వారందరినీ కలవర పెడుతుంది.ఆ బగ్ ఆండ్రాయిడ్ యాప్ ను క్రాష్ చేస్తుంది.వాట్సప్ లో wa.
me/settings అనే లింక్ ఉన్న గ్రూప్ చాట్ తెరిచినప్పుడు ఈ బగ్ ట్రిగ్గర్ చేయబడుతుంది.సాధారణంగా ఈ లింక్ పై క్లిక్ చేస్తే వాట్సాప్ సెట్టింగ్( Whatsapp Setting ) పేజీ ఓపెన్ కావాలి.
కానీ ఈ లింక్ పై క్లిక్ చేస్తే ఆండ్రాయిడ్ మొబైల్స్ ను క్రాష్ చేస్తోంది.కాబట్టి ఈ లింక్ తో చాట్ ను తెరవడం ప్రమాదకరం.
ఈ లింకు అన్ని రకాల వెర్షన్ లను ప్రభావితం చేస్తుంది.

మరి ఈ లింక్ పై క్లిక్ చేసిన వారు ఈ సమస్య నుండి ఎలా బయటపడాలంటే.వాట్సప్ బ్రౌజర్ వెర్షన్, వాట్సప్ వెబ్ లు ఈ బగ్ బారిన పడలేదు కాబట్టి బ్రౌజర్ ద్వారా వాట్సాప్ వెబ్ కు లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత అందులో క్రాష్ అయినా సందేశాన్ని లేదా చాట్ ను సులభంగా తొలగించవచ్చు.
ఇక ఈ లింక్ రానంతవరకు ఫోన్లో ఉండే వాట్సాప్ క్రాష్ అయ్యే అవకాశం ఉండదు.ఇక వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సప్ యాప్ ని అప్డేట్ చేసుకోవాలి.
కాబట్టి అందరూ అనవసర లింకులపై క్లిక్ చేసి కొత్త సమస్యలు సృష్టించుకోవద్దు.ఆన్ లైన్ లో తెలిసిన, అవసరం ఉన్న వాటిని మాత్రమే సర్చింగ్ చెయ్యాలి.అత్యాశకు పోయి అనవసర లింకులపై క్లిక్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.