వాట్సప్( Whatsapp ) తమ యూజర్ల అవసరాలను, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.గత కొంతకాలంగా గమనిస్తే వాట్సప్ లో పలుమార్పులు జరిగాయి.
ఎన్నో సరికొత్త ఫీచర్లను వాట్సప్ ఇప్పటికే పరిచయం చేసింది.తాజాగా మరో కొత్త ఫీచర్( New Feature ) తో యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచాలనే ఆశతో ఓ కొత్త అప్డేట్ పరిచయం చేయనుంది.
ప్రస్తుతం వాట్సప్ ఉపయోగించే వినియోగదారులు గరిష్టంగా 30 సెకండ్ల నిడివి ఉండే వీడియోలను( Video Status ) మాత్రమే స్టేటస్ గా పెట్టుకునే వెసులుబాటు ఉండేది.కానీ తాజా అప్డేట్ తో ఒక నిమిషం నిడివి ఉండే వీడియోలను స్టేటస్ అప్ డేట్ లుగా అప్లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ లో వీడియో స్టేటస్ వ్యవధిని పొడిగించే నిర్ణయం వినియోగదారులకు ప్రయోజకరం అని సంస్థ భావిస్తోంది.
వాట్సప్ ఉపయోగించే చాలామంది యూజర్లు స్టేటస్ అప్డేట్ లుగా ఎక్కువ వీడియోలను షేర్ చేయగల సామర్థ్యాన్ని కోరుకుంటున్నారు.యూజర్ల కోరిక మేరకే వాట్సప్ ఈ సరికొత్త అప్డేట్ ను తీసుకువచ్చింది.ప్రస్తుతం ఈ అప్డేట్ కొంతమంది బీటా టెస్టర్లకు( Beta Testers ) మాత్రమే అందుబాటులో ఉంది.
కేవలం కొద్ది రోజుల్లోనే మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది.ఈ అప్డేట్ అందుబాటులోకి వచ్చాక యూజర్లు ముందుగా వాట్సాప్ ను అప్డేట్ చేస్తేనే షేర్ చేయబడిన పెద్ద వీడియోలను వీక్షించే అవకాశం ఉంటుంది.
వాట్సాప్ యూజర్ల కోరిక మేరకు, వారి భద్రత కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది.అంతేకాదు వాట్సప్ QR( Whatsapp QR Code ) చెల్లింపులను సులభతరం చేయడానికి కృషి చేస్తోంది.మెసేజింగ్ యాప్ మీ QR కోడ్ ను చాట్ ల నుండి నేరుగా షేర్ చేయడానికి అనుమతి ఇస్తుంది.QR కోడ్ షేర్ చేస్తే, వాట్సాప్ లో మీ ఫోన్ నెంబర్ కు బదులుగా మీ పేరును చుపించనుంది.
అయితే వాట్సప్ యూజర్ నేమ్ సపోర్టును పరిచయం చేసిన తరువాత ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.