వాట్సాప్ మంచి ఊపుమీద వుంది... మరో అదిరిపోయే అప్డేట్, ఇకపై అవి కనిపించవు!

అవును, వాట్సాప్( WhatsApp ) మంచి ఊపుమీద వుంది అని అంటున్నారు చాలామంది.గత కొన్నాళ్లుగా అప్డేట్స్ ఇవ్వడంలో వాట్సాప్ అస్సలు స్పీడు తగ్గించడం లేదు.

దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సాప్ ఇంకా యూజర్లను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ యాప్ డెవలపర్స్ నిరంతరం కృషి చేస్తూ కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఇకపోతే ఈ క్రమంలో కొత్త ఫీచర్లు ఎన్ని యాడ్ అవుతున్నా వాట్సాప్ బేసిక్ రూపు మాత్రం ఏమి మారలేదు.

వాట్సాప్ చాట్స్, స్టేటస్, కాల్స్ మనకు కనిపించే విధానంలో ఎటువంటి మార్పు అనేది లేదు.అయితే రానున్న కొత్త అప్డేట్లో యాప్ డెవలపర్స్ ఈ విషయంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.అవును, ఇకపై వాట్సాప్ నావిగేషన్ బార్( Navigation Bar ) కింద కనిపించనుంది.

Advertisement

ఈ మేరకు వాబీటా ఇన్ ఫో ఓ రిపోర్టును తాజాగా ప్రచురించింది.ఈ నివేదిక ప్రకారం.వాట్సాప్ కనిపించే తీరులో చిన్న చిన్న మార్పులు, చేర్పులు రానున్నాయి.

వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకు పైన నావిగేషన్ బార్ లో చాట్, కాల్, స్టేటస్, కమ్యూనిటీ ట్యాబ్ లు మనకు కనిపిస్తాయి.దీనినే ఇప్పుడు మార్చడానికి యాప్ డెవలపర్స్ ప్రయత్నిస్తున్నారు.

ఈ కొత్త అప్ డేట్ త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు( Android Users ) అందుబాటులోకి రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.త్వరలో పూర్తి స్థాయిలో వినియోగదారులకు ఈ మార్పులు అందుబాటులోకి రావచ్చు.పెద్ద ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులను ఒక చేతిని ఉపయోగించి వివిధ ట్యాబ్‌లను నావిగేట్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.

ఈ అప్ డేట్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాక వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ ఫో నివేదిక తాజాగా పేర్కొంది.

వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?
Advertisement

తాజా వార్తలు