Snake Bath : ఏందిరా అయ్యా ఇది... పాముకి చన్నీళ్లతో భలే స్నానం చేయించాడుగా!

ప్రస్తుతం ప్రజలు జంతువులని పెంచుకోవడం అనేది కామన్ అయిపోయింది.వీరు మనుషులకంటే ఎక్కువగా జంతువుల మీద ప్రేమను పెంచుకుంటున్నారు.

 What's The Matter It's Like Bathing A Snake With Tears , Snake, Viral Video, Sn-TeluguStop.com

ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కుక్క, పిల్లి ఇలా ఏదో ఒక జంతువు లేని ఇల్లు కనిపించడం లేదు.కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికా లాంటి దేశాలలో కూడా కోట్లాదిమంది జంతు ప్రేమికులు ఉన్నారు.

వీరు జంతువులను పెంచకుండా అసలు ఉండలేరు.ఎలుక, చిలుక, పిల్లి, పులి, కుందేలు, తాబేలు, కుక్క నక్క ఇలా మనుషులు పెంచుకునే జంతువుల లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది.

కాగా కొందరు పాములను కూడా పెంచుకుంటూ అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నారు.

ఒకప్పుడు పాములంటేనే మనుషులు ఆమడ దూరం పారిపోయేవారు.

కానీ ఇప్పుడు పాములను పెంచుకుని వారి ఇంట్లో ఒక మనిషిలా చూసుకుంటున్నారు.కాగా తాజాగా ఒక యజమాని తన పాముకి చన్నీళ్ళతో స్నానం చేయించాడు.

ఏమాత్రం భయపడకుండా బాత్రూమ్‌లో చలి నీళ్లు పెట్టి ఒక కుక్కపిల్లకి స్నానం చేయించినట్లు అతడు తన పాము తలపై నీళ్లు పోసి అతని చేతితో పాము తలని, శరీరానికి రుద్దుతూ దానికి స్నానం చేయించాడు.ఈ క్రమంలో ఆ పాము వాటర్ మగ్గును నోటితో గట్టిగా కొరకడం చూడవచ్చు.

అయినా కూడా ఆ వ్యక్తి దానికి స్నానం చేయిస్తూనే ఉన్నాడు.

పాముకి స్నానం చేయిస్తున్న వీడియో తీయగా అది సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.‘తండె తండే పానీ సే నహనా చాహియే’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోను ‘సక్ట్ లాగ్’ అనే పేజీ షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియోకి 43 వేల వ్యూస్, 1700 లైక్స్‌ వచ్చాయి.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయ్యండి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube