కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న బిజెపిని( BJP ) ప్రజలు సాగనపడంతో కాంగ్రెస్( Congress ) కు ప్రజలు పట్టణం కట్టారు.కేంద్ర బిజెపి పెద్దలు ఎన్నికల ప్రచారానికి దిగినా, అక్కడే మకాం వేసి పరిస్థితిని సమీక్షించి, కన్నడ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అనేక సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టి, విగ్రహాలు ఏర్పాటు చేసి కొన్ని సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించినా, వాటిని ప్రజలు తిరస్కరించారు.కాంగ్రెస్ కు సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు.
స్వయంగా ప్రధాని నరేంద్ర మోది( Prime Minister Narendra Modi ) అనేకసార్లు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా, ఫలితాన్ని మాత్రం మార్చలేకపోయారు.

ఎన్నికల ఫలితాలతో బిజెపి డీలా పడగా, కాంగ్రెస్ లో కొత్త ఉత్సవం కనిపిస్తోంది.అయితే ఇక్కడి ఫలితాలు బీఆర్ఎస్( BRS ) అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( KCR ) ని కూడా కలవరానికి గురిచేశాయట.అధికార పార్టీపై వ్యతిరేకత చీలిపోతే తప్పకుండా గెలుస్తాము అనే ఫార్ములా అన్నిసార్లు వర్కౌట్ కాదు అనే విషయం ఇక్కడ తేలిపోయింది.
తమతో మితృత్వం కొనసాగిస్తూ ఉండగా, తెలంగాణలో బిజెపి బలోపేతం అయ్యేవిధంగా చేయడంలో కెసిఆర్ కూడా అనేక వ్యూహాలు రచించారు.బిజెపి బలపడితే ఓట్ల చీలిక జరిగి కాంగ్రెస్ గెలుపునకు అడ్డుకట్ట వేయవచ్చని కెసిఆర్ ఊహించారు.
కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాలతో అది సరైన ఆలోచన కాదని తేలిపోయింది .ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగితే ఏదో ఒక పార్టీకి మూకుమ్మడిగా అధికారం కట్టబెడతారని విషయం తేలిపోయింది.ప్రజల్లో తిరగకుండా , పైపైన హడావుడి చేస్తే ఫలితం ఉండదు అనే విషయం ఎన్నికల ఫలితాలతో తేలిపోవడంతో టిఆర్ఎస్ కూడా ఆందోళన చెందుతోంది.ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం రాజకీయ పార్టీగా మారి, రెండుసార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చినా, మూడోసారి అదే సెంటిమెంటును ప్రయోగించి మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ, ఎమ్మెల్యేల పనితీరు ను అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.2018 మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కేటాయించి ఆ ఎన్నికల్లో గెలిచారు.మరోసారి అదే విధంగా సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వాలని కేసిఆర్ భావిస్తున్నారు.అయితే చాలామంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం మంత్రులపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నా, కాంగ్రెస్, బిజెపిలో ఓట్లు చీలికతో సులువుగా గెలుస్తారని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.
అయితే ఆ అంచనాలు అన్ని సార్లు నిజం కాకపోవచ్చు అనే విషయం కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిపోవడంతో, ఇప్పుడు గెలుపుపై బీఆర్ఎస్ లోనూ టెన్షన్ మొదలైందట.కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ప్రస్తుతం కాంగ్రెస్ ఎక్కడలేని ఉత్సవం కనిపిస్తుంది .తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.