టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనిపించుకున్న సంయుక్త మీనన్( Sanyukta Menon ) ఆమె చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూ వచ్చింది.రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో కూడా హిట్ అందుకున్న సం యుక్త ప్రస్తుతం కళ్యాణ్ రామ్( Kalyan Ram ) డెవిల్ సినిమాలో నటిస్తుంది.
ఆల్రెడీ కళ్యాణ్ రాం తో బింబిసార సినిమాలో నటించిన సంయుక్త ఆ సినిమా హిట్ అందుకోవడంతో మళ్లీ అదే రిజల్ట్ రిపీట్ చేసేలా డెవిల్ సినిమా చేస్తున్నారు.ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా సం యుక్తకి మరో హిట్ రెడీగా ఉందని అంటున్నారు.
అయితే సంయుక్త ఈ సినిమా డెవిల్ ( Devil )తర్వాత మరో సినిమా ఫైనల్ చేయలేదు.సార్ తో తమిళం ఫ్యాన్స్ ని అలరించిన సంయుక్త అక్కడ కూడా వరుస అవకాశాలు తెచ్చుకుంటుంది.తెలుగులో డెవిల్ తర్వాత నెక్స్ట్ సినిమా ఫైనల్ కాలేదు.సంయుక్త సందడి ఈమధ్య కొద్దిగా తగ్గినట్టే అనిపిస్తుండగా రెండు భారీ సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయని తెలుస్తుంది.
మరి ఆ సినిమాలు వస్తేనే కానీ మళ్లీ సంయుక్త హడావిడి మొదలవుతుందని చెప్పొచ్చు.ఏది ఏమైనా తెలుగులో మాత్రం మలయాళ భామకు మంచి క్రేజ్ ఏర్పడింది.