వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో 2009 నుంచే సీఎం జగన్ యుద్ధం మొదలుపెట్టారని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబును భూస్థాపితం చేసి జనసేనాని పవన్ ను ఓడించడమే కాకుండా లోకేశ్ కు సమాధి కట్టారని కొడాలి నాని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అని చంద్రబాబు అన్నారన్న కొడాలి నాని సుమారు ముప్ఫై ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం నియోజకవర్గానికి ట్రాన్స్ ఫర్ అయ్యారని తెలిపారు.
లోకేశ్ పుట్టింది మంగళగిరిలోనా? అని ప్రశ్నించారు.అలాగే పవన్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడారా అని ఎద్దేవా చేశారు.
తండ్రీ కొడుకుతో పాటు పార్ట్ నర్ కూడా వలసవెళ్లిన వారేనని పేర్కొన్నారు.పవన్, లోకేశ్ మరియు చంద్రబాబు యుద్ధభేరీతో జగన్ ను ఏం చేయలేరని తెలిపారు.