అక్కినేని నాగార్జున ( Nagarjuna Akkineni ) నుండి మరో మూవీ రాబోతుంది.ఈసారి పొంగల్ సీజన్ లో తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ మధ్య వరుస ప్లాప్స్ అందుకుంటున్న నాగ్ ఈసారి ఫ్యామిలీ మొత్తం చూసేలా మంచి ఎంటర్టైనర్ ను సంక్రాంతి సీజన్ లో తీసుకు రాబోతున్నాడు.ఈ సీజన్ లో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారో అలాంటి సినిమాతో రాబోతున్నాడు.
మరి నాగ్ వరుస ప్లాప్స్ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఆచి తూచి ఎంచుకున్న మూవీ ”నా సామిరంగ” ( Naa Saami Ranga).ఈ మధ్యకాలంలో నాగార్జున సినిమాకు ఈ రేంజ్ లో అంచనాలు ఏర్పడలేదు.
అనౌన్స్ మెంట్ రోజునే టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగేలా చేసాడు.తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేసారు.సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.అయితే ఈ సినిమా డేట్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు రిలీజ్ డేట్ లను ప్రకటించడమే కాకుండా ట్రైలర్స్ కూడా రిలీజ్ చేసి ప్రమోషన్స్ లో ముందు ఉన్నారు.నాగార్జున నా సామిరంగ సినిమా మినహా మిగిలిన అన్ని సినిమాలు రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకున్నాయి.మరి వీరు కూడా సస్పెన్స్ వీడి ఎప్పుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారో చూడాలి.కాగా ఈ సినిమాలో రాజ్ తరుణ్, అల్లరి నరేష్, మిర్నా మీనన్ ( Mirnaa Menon ) కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక విజయ్ బన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ ( Ashika Ranganath ) హీరోయిన్ గా నటిస్తుంది.