కేసీఆర్ పోరాటం వెనుక ఆరాటం ఏంటంటే ?

తెలంగాణలో చేస్తున్న, చూస్తున్న రాజకీయం ఒక్కటే సరిపోదని, దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ కు క్రేజ్ పెంచాలని ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ డిసైడ్ అయినట్టు గా కనిపిస్తున్నారు.అందుకే ఎక్కువగా జాతీయ అంశాలను ఫోకస్ చేస్తూ, కేంద్ర అధికార పార్టీ బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

 What Is The Worry Behind The Kcr Fight, Kcr, Telangana, Bjp, Trs, Kcr, Telangana-TeluguStop.com

తెలంగాణలో బీజేపీ బలపడకుండా, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.బీజేపీతో టిఆర్ఎస్ కు ఎటువంటి సన్నిహిత సంబంధాలు లేవని, ఆ పార్టీ ని ఎండగట్టడంలో తాము ఎటువంటి మొహమాటానికి గురవడం లేదు అన్న సంకేతాలు పంపిస్తున్నారు.

ఇటీవలే పంజాబ్ రాష్ట్రానికి చెందిన చెస్ ప్లేయర్ మల్లికా హాండా ను ప్రత్యేకంగా తెలంగాణకు పిలిచి 15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.వికలాంగులు ప్రతిభ చూపి పథకాలు సాధిస్తే  వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

అంతకు ముందే దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించి దేశవ్యాప్తంగా  టిఆర్ఎస్ ప్రభుత్వం పై చర్చ జరిగేలా చేశారు.

ఇలా జాతీయ స్థాయి లో ఫోకస్ అయ్యే అన్ని అంశాలపైనా ఇటీవల కాలంలో ఎక్కువగా కేసిఆర్ దృష్టి పెడుతుండటం,  దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ ఉండడం, బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ ఒక కూటమిగా ఏర్పాటు చేసే విషయంలో చురుగ్గా వ్యవహరించడం,  ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలో రాబోతున్న కూటమిలో కేసీఆర్ కీలకంగా వ్యవహరించడం ఇవన్నీ జాతీయ స్థాయిలో టిఆర్ఎస్ ను  తీసుకువెళ్లేందుకు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న అంశాల పైనా ఆయన దృష్టి సారిస్తున్నారు.ఇలా జాతీయ స్థాయిలో కేసీఆర్ ఫోకస్ అవుతూ టీఆర్ఎస్ ను ఫోకస్ చేస్తూ బీజేపీ కి మంటపుట్టే విధంగా వ్యవహారాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube