బాలయ్య బాబు( Balakrishna ) సినిమా అంటే ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే అయితే బాలయ్య, బోయపాటి( Boyapati Srinu ) కాంబో లో వచ్చిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యయో కూడా మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పని ఒక సింహ ( Simha )ఒక లెజెండ్ ఒక అఖండ వరుసగా ఒకదానిని మించిన హిట్ గా ఒకటి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.అయితే బాలయ్య లాంటి ఒక డైనమిక్ హీరో కి బోయపాటి ఎలా పరిచయం అయ్యాడు అసలు బోయపాటి లాంటి డైరెక్టర్ కి సింహ సినిమా చేయడానికి ముందు బాలయ్య పెట్టిన కండీషన్లు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
బాలయ్య సింహ సినిమాకి ముందు తీసిన చాలా సినిమాలు వరుసగా ప్లాప్ అయినా విషయం మనకు తెలిసిందే.నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ లుగా మిగిలాయి.అందుకే బాలయ్య ఇక మీదట చేసే సినిమాల మీద చాలా కేర్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు బోయపాటి వెళ్లి తన దగ్గర ఉన్న కథ ని బాలయ్య కి వినిపించడం జరిగిందట అది విన్న బాలయ్య కథ బాగుంది కానీ ఈయన అంత మాస్ ఎలిమెంట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకొని మొదటి షెడ్యూల్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ తీద్దాం అని చెప్పాడట అది బాగా చేస్తే సినిమా కంటిన్యూ చేద్దాం లేకపోతే సినిమాని ఆపెద్దాం అని అనుకున్నాడట బాలయ్య….
దానికి తగ్గట్టుగానే బోయపాటి మొదటి షెడ్యుల్ లో ట్రైన్ ఎపిసోడ్ ఫైట్ సీన్ తీసాడట అది చూసిన బాలయ్య( Balakrishna ) కి ఆయన మేకింగ్ మీద నమ్మకం పెరిగి సినిమా కంటిన్యూ చేశాడట ఇక వాళ్ల కాంబో లో వచ్చిన వరుస సినిమా లు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనం చెప్పాల్సిన పని లేదు…ఇప్పటికీ ఈ కాంబో లో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి…