తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ… ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాయి.ఇలాంటి క్రమంలోనే ఆయన పరుశురాం డైరెక్షన్ లో చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా( Family Star ) ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా మీద ప్రస్తుతం విజయ్ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకు అంటే ఇంతకుముందు ఆయన చేసిన ఖుషి సినిమా( Khushi movie ) అవరెజ్ గా ఆడింది.అయితే విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) భారీ సక్సెస్ కొట్టి చాలా సంవత్సరాలు అవుతుంది.‘ గీత గోవిందం’ సినిమా తర్వాత ఆయనకు ఆ రేంజ్ లో భారీ సక్సెస్ అయితే రాలేదు.అయితే ఈ సినిమా వచ్చి దాదాపు 6 సంవత్సరాలు కావస్తుంది.కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆ సినిమా మాదిరిగానే సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఆశిస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో విజయ్ మరో సారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఒకవేళ ఈ సినిమా కనక ప్లాప్ అయినట్లయితే మాత్రం విజయ్ మార్కెట్ భారీ గా డౌన్ అయిపోతుందనే చెప్పాలి.ఇప్పటికే లైగర్ సినిమాతో ఆయన భారీగా వెనకబడి పోయారు.యంగ్ హీరోలతో పోలిస్తే విజయ్ దేవరకొండ మార్కెట్ అనేది భారీగా తగ్గిపోయిందనే చెప్పాలి.ఇక ఇప్పుడు ఈ సినిమాతో కనక తనని తాను ప్రూవ్ చేసుకుంటేనే మరోసారి స్టార్ హీరోగా వెలుగొందుతాడు లేకపోతే మాత్రం విజయ్ మార్కెట్ భారీగా పడిపోతుందనే చెప్పాలి…
.