ఆది సినిమాతో డైరెక్టర్ గా మారిన వి వి వినాయక్ ఆ సినిమా తోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆయన తీసిన ఆది సినిమా అప్పుడు చిరంజీవి ఇంద్ర సినిమాతో పోటీ పడి మరి భారీ కలక్షన్స్ ని రాబట్టింది.ఈ సినిమా కి ముందు వినాయక్, దర్శకుడు సాగర్ దగ్గర కో డైరెక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడు అప్పుడు ఎల్ బి శ్రీరామ్ రైటర్ గా చాలా సినిమాలకి పనిచేస్తూ వచ్చాడు అలా సాగర్ గారి సినిమాకి రైటర్ గా ఉన్న ఎల్ బి శ్రీరామ్ కి వినాయక్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది అలా వీళ్లిద్దరూ తరుచూ కలుస్తూ సినిమాల గురించి డిస్కస్ చేస్తూ ఉండేవారు.

ప్రతి సినిమా గురించి చాలా అనాలసిస్ లు చేస్తూ ఏ సినిమా ఎందుకు ప్లాప్ అయింది ఏ సినిమా ఎందుకు హిట్ అయింది అనే లెక్కలు రాసుకుంటూ ఉండేవారట అలా వాళ్ల మధ్య మంచి స్నేహబంధం ఉండేదట చాలా సార్లు ఎల్ బి శ్రీరామ్ వినాయక్ టాలెంట్ చూసి ఎంటి అబ్బాయి ఇంకా నువ్వూ ఇక్కడే ఉంటున్నావ్ తొందరగా డైరెక్టర్ అవ్వు సినిమా స్టార్ట్ చేయి అని చాలా సార్లు చెప్పారట దానికి ఇంకా టైం ఉంది బాబాయ్ అని వినాయక్ బదులు ఇచ్చేవాడట.ముద్దుగా వినాయక్ ఎల్ బి శ్రీరామ్ ని బాబాయ్ అని సంబొదించేవాడట.

అయితే వీలైనప్పుడల్లా వీళ్లిద్దరూ థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసేవాల్లట ఒక రోజు ఒక సినిమా కి వెళ్లి వస్తున్న టైం లో వాళ్ళు తీసుకెళ్లిన బండి పెట్రోల్ అయిపోయిందట దాంతో పెట్రోల్ కి డబ్బులు లేక ఆ బండి ని ఒక ఆరు కిలోమీటర్ల వరకు తోసుకుంటూ వచ్చారట.అలా వాళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా కాలం నుంచి అలాగే కొనసాగుతుందట…