లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈ ఏడాది ఈమె సంక్రాంతి పండుగ సందర్భంగా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈమె తరచు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇక నేడు వాలెంటైన్స్ డే కావడంతో ఈమె తన ప్రియుడితో కలిసి ఒక రొమాంటిక్ ఫోటోని షేర్ చేస్తూ తన ప్రియుడు గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం శృతిహాసన్ ముంబైకి చెందిన డూడూల్ ఆర్టిస్ట్ శంతను హజారికతో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వీరిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేసిన శృతిహాసన్ తన ప్రియుడు గురించి చెబుతూ… నువ్వు నా బెస్ట్.నువ్వు ఎప్పటికీ నా మదిలోనే ఉంటావు.
నువ్వే నా వెలుగు.నువ్వే నా చీకటి ఈ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాలని అంటూ తన ప్రియుడు గురించి ఈమె చాలా గొప్పగా చెబుతూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.







