Bhuvneshwar Kumar : ఎస్ఆర్ హెచ్ టీమ్ మీద భువనేశ్వర్ కుమార్ అసంతృప్తి గా ఉండటానికి కారణం ఏంటంటే..?

ఇక తొందరలోనే ఐపిఎల్ 17 సీజన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు తమ టీమ్ ల యొక్క సామర్ధ్యాలను బట్టి ఎవరిని టీం లోకి తీసుకోవాలి అనే దానిమీద తుది నిర్ణయానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే సన్ రైజర్స్ హైదరాబాద్( Sunrisers Hyderabad) టీం కూడా 2024 సీజన్ నుంచి తమ టీమ్ కి కొత్త కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్( Pat Cummins ) ను నియమించినట్టుగా స్పష్టం చేశారు.

 What Is The Reason Why Bhuvneshwar Kumar Is Unhappy With Srh Team-TeluguStop.com

ఇక దానికి తగ్గట్టు గానే ఆయన కెప్టెన్సీలో సన్ రైజర్స్ టీమ్ ఆడబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక పాట్ కమ్మిన్స్ కి కెప్టెన్సీ ఇవ్వడం పట్ల ఆ టీమ్ సీనియర్ ప్లేయర్ అయిన భువనేశ్వర్ కుమార్ కొంత వరకు అసంతృప్తి తో ఉన్నట్లు గా వార్తలైతే వస్తున్నాయి.

ఎందుకంటే భువి కూడా ఈ టీమ్ కి కెప్టెన్ కొద్ది రోజులపాటు తన సేవలను అందించారు.కొంతవరకు ఆయన కెప్టెన్సీ బాగున్నప్పటికి అప్పుడు హైదరాబాద్ టీం లో ఉన్న ప్లేయర్లు ఎవరు కూడా అంత మంచి పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేదు దానివల్ల తన కెప్టెన్ గా చేసిన చాలా మ్యాచులు ఓడిపోవల్సి వచ్చింది.అయినప్పటికీ అది తన ఒక్కడి మిస్టేక్ మాత్రమే కాదు.టీమ్ లో 11 మంది ప్లేయర్లు సరిగ్గా ఆడినప్పుడే కెప్టెన్ అనేవాడు టీమ్ ను ముందుకు తీసుకెళ్తాడు.

ప్లేయర్స్ కూడా సరిగ్గా ఆడనప్పుడు కెప్టెన్ ఒక్కడు మాత్రం ఏమి చేయగలడు.ఈ సీజన్ లో భువనేశ్వర్ కుమార్( Bhuvneshwar Kumar ) కి కెప్టెన్ గా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అని ఆయన భావిస్తున్నాడు.ఇక భువి కి మద్దతుగా మరి కొంతమంది సీనియర్ ప్లేయర్లు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ఈ సారి మాత్రం ఎస్ ఆర్ హెచ్ టీమ్ యాజమాన్యం పక్కగా టైటిల్ కొట్టాలనే సంకల్పం తో ఉన్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube