తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లలో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ( Dil Raju )తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కాకుండా డైరెక్టర్లు అందరితో తన ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేయించుకుంటూ ఇండస్ట్రీలో ఒక టాప్ ప్రొడ్యూసర్ గా ఎదుగుతున్నాడు.అయితే ఇదే క్రమంలో ఈయన విజయ్ దేవరకొండ తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ ( Family Star )అనే సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే దర్శకుడు పరుశురాం( Parasuram ) చెప్పిన సెకండ్ హాఫ్ ముందు చెప్పినప్పుడు దిల్ రాజు కి బాగా నచ్చిందట కానీ ఆయనకి ఇప్పుడెందుకో ఆ సినిమా నచ్చడం లేదంట అందుకే స్టోరీ చెప్పినప్పుడు ఓకే అనిపించింది.
కానీ ఇప్పుడు మాత్రం అంత ఇంపాక్ట్ అనిపించకపోవడంతో సెకండ్ హాఫ్ మార్చి మళ్ళీ షూట్ చేద్దాం అన్నట్టుగా దిల్ రాజు పరుశురాం తో చెప్పాడట కానీ పరుశురాం దానికి కుదరదు అని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ మ్యాటర్ ని విజయ్ వచ్చి డీల్ చేసినట్టుగా తెలుస్తుంది.అయితే నిజానికి దిల్ రాజు డిసిజన్ చాలా కరెక్ట్ గా ఉంటుందనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వస్తున్న మాట…
ఇక ఆయనకి తేడా గా అనిపించింది అంటే ఆ సినిమాలో ఏదో బొక్క ఉండే ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు.ఇక ఈ సినిమాలో కూడా ఏదో మైనుస్ పాయింట్ ఉండటంతో దిల్ రాజు( Dil Raju ) అలా చెప్పినట్టు గా తెలుస్తుంది.దాన్ని కనక ఒకసారి సరి చేసుకుంటే దర్శకుడు పరుశురాం కెరియర్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది అని కొంతమంది దిల్ రాజు కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు.
మరి ఈ వాగ్వివాదం ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూడాలి…
.