తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న హీరోలలో నాగార్జున( Nagarjuna ) ఒకరు.ఇక ప్రస్తుతం నాగార్జున నా సామి రంగ సినిమా ( na Sami Ranga movie )వర్క్ లో బిజీగా ఉన్నారు.
ఇక ఈయన సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు అనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా మీదనే నాగార్జున తనదైన రీతిలో బాగా కష్టపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన ఒకటి, రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా మీద తన పూర్తి దృష్టిని కేంద్రీకరించినట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు ఫెయిల్యూర్స్ గా మిగలడంతో ఇంతకు ముందు సినిమాల్లో చేసిన తప్పులను రిపీట్ అవ్వకుండా చూసుకుంటూనే తను దగ్గరుండి ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాతో కనక సక్సెస్ కొడితే నాగార్జున నెక్స్ట్ మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి.

ఇక నాగార్జున తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ అయితే సొంతం చేసుకున్నాడు.కానీ వరుస సక్సెస్ లను కొట్టడంలో మాత్రం సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ( Chiranjeevi, Balakrishna )లతో పోటీ పడలేకపోతున్నాడు వాళ్లు వరుసగా సినిమాలు చేస్తూ మంచి దూకుడు మీద ఉంటూ మంచి విజయాలను అందుకుంటుంటే నాగార్జున మాత్రం రెండు సంవత్సరాల ఒక సినిమా చొప్పున చేస్తూ వస్తున్నాడు.2023 వ సంవత్సరంలో నాగార్జున నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్లోకి రాలేదు.ఇక ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ తలో రెండు సినిమాలను రిలీజ్ చేశారు.ఇక ఇప్పటికైన నాగార్జున తన దూకుడు పెంచి ఎక్కువ సినిమాలు చేస్తే మంచిదని తన అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే ఇప్పటికే నా సామిరంగా సినిమా టీజర్ వచ్చినప్పటికీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించే విధంగా అయితే కనిపించడం లేదు.కాబట్టి ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందా లేదా అనే విషయం మీదనే చాలామందికి చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయి.ఈ సినిమాతో నాగార్జున సక్సెస్ కొట్టి మళ్ళీ స్టార్ హీరోగా కొనసాగుతాడా లేదా అనేది చూడాలి…
.







