తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఈయన చేసిన ప్రతి సినిమా ఒకప్పుడు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా స్టార్ హీరోగా కూడా ఎదిగాడు.ఇక అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే సంపాదించుకున్నాడు.
మహేష్ బాబు కి వచ్చిన మొదటి సూపర్ సక్సెస్ సినిమా ఏదైనా ఉంది అంటే అది మురారి సినిమా అనే చెప్పాలి.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణకి, కృష్ణవంశీ ( Krishna, Krishnavamsi )గారికి మధ్య కొంచెం విభేదాలు వచ్చినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.అది ఏంటి అంటే ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక మంచి ఫైట్ పెట్టమని కృష్ణ గారు అడిగితే దానికి కృష్ణవంశీ స్టోరీ ప్రకారం అయితే ఇక్కడ ఫైట్ పెట్టకూడదు సార్ నార్మల్ గా సినిమాని ముగించేద్దామని చెప్పారట.కానీ హీరో అన్న తర్వాత ఫైటింగ్స్ చేయాలి కాబట్టి కృష్ణ చెబుతూ ఇలా ఫ్లాట్ గా ఉంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పాడట.

కానీ కృష్ణవంశీ మాత్రం తను నమ్మిందే చేస్తానని కరాకండిగా చెప్పడంతో కృష్ణ వంశీ మీద కృష్ణ కొంతవరకు కోపానికి అయితే వచ్చారట.కానీ మొత్తానికైతే కృష్ణవంశీ చెప్పినట్టుగానే ఆ సినిమాలో పెద్దగా ఫైట్ సీన్స్ లేకుండా క్లైమాక్స్ ని చాలా కూల్ గా డిజైన్ చేయడంతో సినిమా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి.ఇక మహేష్ బాబు కి ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కిందనే చెప్పాలి.ఇక దాంతో పాటు మహేష్ కు మొదటి సూపర్ సక్సెస్ సినిమాను ఇచ్చిన డైరెక్టర్ గా కృష్ణవంశీ కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు…
.







