తల్లిదండ్రులకు శ్రాద్ధం నదీ తీరం వద్దే ఎందుకు చేయాలి?

చాలా మంది తల్లి లేదా తండ్రి చనిపోతే శ్రాద్ధం ఇంట్లోనే జరిపించాలని చెబుతుంటారు.

 కానీ తల్లిదండ్రుల పుణ్య తిథి ఇంట్లోనే జరిపించాలన్న నియమేమీ లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 అందరికీ నిర్వహించినట్లే నదీ తీరం వద్ద నిర్వహించ వచ్చని వివరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నదీ తీరంలో చేయడమే చాలా ఉత్తమమని అంటున్నారు.

 నదీ తీరాన ఉన్న పుణ్య క్షేత్రంలో శ్రాద్ధం పెట్టిస్తే మరింత మంచిదట. తీర్థమూ, క్షేత్రమూ కలిసిన చోట నది పవిత్రతతో పాటు అక్కడి దేవుడి దీవెనలు కూడా ఉంటాయని ప్రజల నమ్మకం.

నదీ తీరమే.చాలా మంచిది!

అంతే కాకుండా అవన్నీ పితృ కార్యం సక్రమంగా జరిగేందుకే  చాలా దోహద పడతాయట.

Advertisement

 శ్రద్దతో నిర్వహించేదే శ్రాద్ధమని కూడా చెబుతుంటారు. మనకు జీవితాన్ని  ఇచ్చిన తల్లిదండ్రలపై ప్రేమ, గౌరవం, కృతజ్ఞతతో ఉండాలని.

 వారు చనిపోయిన తర్వాత భక్తి శ్రద్ధలతో వారి పుణ్య తిథి నిర్వహించాలని సూచిస్తున్నారు.

జన్మను ఇచ్చిన వారికి.

భక్తి శ్రద్ధలతో. 

ఆ పితృ కార్యం బాగా చేస్తేనే. మన మీద ఎంతో ప్రేమ పెట్టుకున్న వారి ఆత్మకు శాంతి చేకూరుతుందట. అప్పుడే వారి ఆత్మ లోకాన్ని వదిలి వెళ్తుందని కూడా ప్రజల నమ్మకం.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024

 అందుకే భక్తి, శ్రద్ధలతో పాటు ఏకాగ్రత స్థిరం కావాలంటే నదీ తీరమే సరైన స్థలమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందకే నదీ తీరం వద్ద పుణ్య తిథి నిర్వహించడమే చాలా మంచిదని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు