టి కాంగ్రెస్( T Congress ) గత కొన్ని రోజులుగా యమ దూకుడు మీద ఉన్న సంగతి తెలిసిందే.పార్టీలో చేరికలు పెరుగుతుండడం, సర్వేలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తుండడం వంటి అంశాలతో విజయం పై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు హస్తం నేతలు.
అయితే ఎన్నికల ముందు పార్టీ ఎంత హడావిడి చేస్తున్న పార్టీని ఒక్క ప్రశ్న మాత్రం తెగ వేదిస్తోంది.అదే సిఎం అభ్యర్థి ఎవరనే అంశం.
ప్రస్తుతం కాంగ్రెస్ లో అయిదారుగులు నేతలు సిఎం పదవిపై గట్టిగా కన్నెశారు.ప్రస్తుతం పార్టీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటివారి చుట్టూ సిఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్న తిరుగుతోంది.

సిఎం అభ్యర్థి విషయంలో అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నప్పటికి ఎవరికి వారు తామే ఉండాలని భావిస్తున్నారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క( Komatireddy Venkatareddy, Bhatti Vikramarka ) వంటివారు ఇప్పటికే పలుమార్లు వారి మనసులో మాటను బయట పెట్టారు కూడా.ఈ నేపథ్యంలో ఎవరిని సిఎం అభ్యర్థిగా ప్రకటించిన పార్టీలో చీలిక రావడం ఖాయమనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట.ఈ ఎంపిక పై అధిష్టానం కూడా మల్లగుల్లాలు పడుతుదట.అయితే సిఎం అభ్యర్థి ఎవరనే సంగతి ఇప్పుడు హోల్డ్ లో ఉంచి ఎన్నికల తరువాత వచ్చే ఫలితాలను బట్టి పేరును ప్రకటించాలనేది హైకమాండ్ వ్యూహంగా తెలుస్తోంది.

అయితే పార్టీలోని కొందరు నేతలు సిఎం అభ్యర్థి విషయంలో భిన్నంగా స్పందిస్తున్నారు.బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని సిఎం అభ్యర్థిగా నియమించాలని, పార్టీలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి వంటివారు పార్టీకి నష్టం కలిగిస్తారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ ( Former MLA Gone Prakash )వంటివారు చెబుతున్నారు.దీంతో సిఎం అభ్యర్థిని ఫైనల్ చేయడం హైకమాండ్ కు కత్తి మీద సామే.
మరి ప్రస్తుతం గెలుపే లక్ష్యంగా ఉన్న అధిష్టానం.ఇప్పటికే తొలి జాబితా అభ్యర్థులను కూడా విడుదల చేసింది.
త్వరలోనే రెండో జాబితాను కూడా విడుదల చేయబోతుంది.మరి సిఎం అభ్యర్థి విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ కు ఎప్పుడు తెర దించుతుందో చూడాలి.