జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం సొంత పార్టీ నేతలకు , ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న వారికి కూడా అర్థం కావడం లేదు.అసలు పవన్ జనసేన ను ఏవిధంగా ముందుకు తీసుకువెళ్తారు అనే విషయంలో ఎవరికి ఒక క్లారిటీ లేదు.
కొంతకాలం రాజకీయాలు, మరి కొంతకాలం సినిమాలు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉన్నా, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
అసలు జనసేనను పట్టించుకోనట్టు బిజెపి వ్యవహరిస్తుంటే, బిజెపిని తాము పరిగణలోకి తీసుకోవడం లేదు అన్నట్లుగా జనసేన నాయకులు వ్యవహరిస్తున్నారు.
మొదటి నుంచి ఇదే రకమైన పరిస్థితి చక్కదిద్దేందుకు రెండు పార్టీల నేతలు కృషి చేయకపోవడంతో, ఈ గందరగోళం నెలకొంది.
ప్రస్తుతం బిజెపి జనసేన వ్యవహారంతో విసిగిపోయి ఒంటరిగానే పోరాటాలు చేయాలని డిసైడ్ అయిపోయింది.దీంతో ఈ రెండు పార్టీల పొత్తు త్వరలోనే తెగతెంపులు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
దీంతో జనసేనను ఒంటరిగానే ఎన్నికల బరిలోకి పవన్ తీసుకువెళ్తారా లేక మరేదైనా పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నారా అనే విషయం సొంత పార్టీ నేతలకు తెలియకపోవడంతో, మరింత గందరగోళం నెలకొంది.

ఒక వైపు చూస్తే బీజేపీతో పొత్తు కోసం టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.కానీ ఆ అవకాశం కనిపించకపోవడంతో, 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు.అవసరమైతే మెజారిటీ స్థానాలను జనసేనకు కేటాయించేందుకు టిడిపి సిద్దమవుతుండటంతో పవన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.
ఈ విషయంలో పవన్ కూడా కాస్త ఆందోళనలో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు.గతంలోనే ఒక రాజకీయ పార్టీని నడిపించడం అంటే ఆషామాషీ కాదు అని, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు బీజేపీ దూరం పెడుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.