రెబల్ స్టార్ ప్రభాస్ ( Rebel Star Prabhas ) ఈ మధ్యనే తన 44వ బర్త్ డే ని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు.అయితే ప్రభాస్ బర్త్ డే కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆయన అభిమానులు ఉన్నారో వారందరూ ప్రభాస్ బర్త్డేని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు.
మరీ ముఖ్యంగా జపాన్ (Japan) లో అయితే ప్రభాస్ బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.ఇక ఈయన బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ప్రభాస్ రాజుల వంశానికి చెందినవారు కాబట్టి ఏం చేసినా కూడా చాలా స్పెషల్ గా చేస్తారు.అంతేకాదు తనతో నటించే చాలామంది నటీనటులను తన ఇంటికి తీసుకువెళ్ళి మరీ భోజనాలు పెట్టించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక షూటింగ్ సెట్లో కూడా చాలామందికి భోజనాలు అరేంజ్ చేసి రాజుల మర్యాదలు చేసేవారట.ఇక ఈ అలవాటుని కృష్ణంరాజు.( Krishnam Raju ) దగ్గర నుంచి ప్రభాస్ నేర్చుకున్నారని తెలుస్తోంది.ఇక ఎన్ని సినిమాల్లో చేసినా కూడా ప్రభాస్ డైటింగ్ లాంటిది ఏది పాటించరట.
తనకి ఇష్టమైన ఫుడ్ మొత్తం లాగిస్తూ ఉంటారట.మరీ ముఖ్యంగా ప్రభాస్ కి ముక్క లేనిదే ముద్ద దిగదట.

అయితే అలాంటి ప్రభాస్ ( Prabhas ) తన బర్త్డే రోజు మాత్రం ఒక సెంటిమెంట్ ని ఫాలో అవుతారు అని తెలుస్తోంది.ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే.ప్రభాస్ మామూలు రోజుల్లో ప్రతిరోజు నాన్ వెజ్ తో తింటూ ఉంటారు.కానీ ఒక బర్త్ డే రోజు మాత్రం నాన్ వెజ్ అస్సలు ముట్టుకోరట.అయితే దీనికి ప్రధాన కారణం ప్రభాస్ తల్లి ఎక్కువగా దేవుళ్లను నమ్ముతూ ఉంటుంది.ఇక బర్త్డే రోజు తన కొడుకుతో దేవుడికి పూజ చేయించి ఆరోజు మొత్తం నాన్ వెజ్ తినకుండా ఉండాలి అని చెప్పిందట.
ఇక అప్పటినుండి ప్రభాస్ తన తల్లి చెప్పిన మాటలను వింటూ బర్త్డే రోజు నాన్ వెజ్ అస్సలు ముట్టుకోరట.అయితే ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజెన్లు ప్రభాస్ కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఫాలో అవుతారా అని ఆశ్చర్యపోతున్నారు.







