ఒక సినిమా పరాజయం పాలైతే ఖచ్చితంగా ఆ ప్రభావం ఇటీవల కాలంలో గమనిస్తే హీరోయిన్స్ పై, అలాగే దర్శకులపై మాత్రమే పడుతుంది.హీరోయిన్స్ ని ఐరన్ లెగ్స్ గా తీసి పక్కన పెడుతున్నారు.
ఇక సినిమా దర్శకుడికి మరో చిత్రాన్ని ఒప్పుకునేందుకు కొంతమంది హీరోలు వెనకడుగు వేస్తున్నారు.దీన్ని బట్టి చూస్తే ఒక సినిమా విజయం లేదా పరాజయం దర్శకుడి కెరీయర్ ని నిర్ధారిస్తుంది.
ఇలాంటి ఒక సిచువేషన్ లోనే ప్రస్తుతం టాలీవుడ్ ఒక డైరెక్టర్ ఇరుక్కుని ఉన్నారు.అతడు మరెవరో కాదు ఫ్యామిలీ స్టార్ సినిమాతో( Family Star Movie ) పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్న పరుశురాం.
విజయ్ దేవరకొండ తో( Vijay Devarakonda ) తీసిన ఫ్యామిలీ స్టార్ పరాజయం పాలవడంతో తన తదుపరి సినిమా గురించి ప్రస్తుతం ఆలోచనలో పడ్డాడు పరుశురాం.

వాస్తవానికి పరుశురాం( Director Parasuram ) మొదటి సినిమా గీత గోవిందం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా మినహాయిస్తే తను మరో సినిమా తీయడానికి దాదాపు 5 ఏళ్ల సమయం తీసుకున్నాడు.అలా ఐదేళ్ల విరామం తర్వాత మహేష్ బాబుతో సర్కారు వారి పాట( Sarkaru Vaari Paata ) అనే సినిమా తీశాడు.
దీనికన్నా ముందు నాగచైతన్య తో ఓ సినిమా చేయాల్సి ఉన్నప్పటికి మహేష్ సినిమా ఆఫర్ రావడంతో నాగచైతన్యకి హ్యాండ్ ఇచ్చాడు.అయితే సర్కారు వారి పాట సినిమా విజయన్నైతే అందుకుంది కానీ స్క్రిప్ట్ విషయంలో కొన్ని మైనస్ పాయింట్స్ కనిపించాయి.
ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ విషయంలో అయితే దారుణమైన డిజాస్టర్ ఫలితం వచ్చింది.దీంట్లో అనేక ఇబ్బందులు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి.

నిజానికి పరశురాం కథలను రెడీ చేసుకున్నప్పుడు పూర్తిస్థాయి అంచనా వేయలేకపోతున్నాడనే విషయం అతడు తీసిన గత రెండు సినిమాలను బట్టి అంచనా వేయొచ్చు.దాంతో తను మళ్ళీ తీయబోయే సినిమా ఎలా ఉంటుంది అని అందరూ టాలీవుడ్ లో గుసగుసలాడుతున్నారు.అయితే ఇప్పటికే దిల్ రాజు( Dil Raju ) పరుశురాంకి మరో సినిమా ఆఫర్ ఇస్తానని మాట ఇచ్చాడట.దాని ప్రకారం చూస్తే కాస్త మార్కెట్ ఉన్న హీరో దొరికితే చాలు.
ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఫామ్ లో పడి అవకాశం ఉంటుంది.అయితే అందుకు స్క్రిప్ట్ పై పరుశురాం గట్టిగా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది.
నిజానికి పరుశురాం ఒక్కసారి కథ ఓకే అనుకున్నాక ఎవర్ని వేలు పెట్టనివ్వరు అని టాక్ కూడా ఉంది.మరి తను తీయబోయే నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది ? ఆ హీరో ఎవరు అని తెలియాలంటే మరి కొంతకాలం పట్టొచ్చు.