రాజకీయాల్లో ఎప్పుడూ శత్రువులు, మిత్రులు అనే వారు ఉండరు.ఎప్పుడు ఎవరు శత్రువులు అవుతారో, ఎప్పుడు ఎవరు మిత్రులు అవుతారో ఎవ్వరికి తెలియదు.
ఇప్పుడు తెలంగాణలో ఎప్పటినుంచో శత్రువులుగా ఉన్న వారిలో కేసీఆర్, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఉన్నారు.ఒకరంటే ఒకరికి ఎప్పటికీ పడనే పడదు.
కేసీఆర్ నోట కోమటి బ్రదర్స్‌ను పొగిడిన సందర్భం లేదు.అలాగే వారు కూడా కేసీఆర్‌ను ఎన్నడూ పొగడలేదు.
కానీ నిన్న కేసీఆర్ నల్గొండలోని జనగామలో కొత్త కలెక్టరేట్ ఓపెనింగ్‌కు వెళ్లారు కేసీఆర్.ఇందులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
అయితే రాగానే ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురు పడ్డారు.దీంతో కేసీఆర్, వెంకట్ రెడ్డి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.
అంతే కాకుండా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌పై కోటిరెడ్డి ప్రశంసలు కురిపించారు.కేసీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు.
పైగా ఇద్దరూ కలిసి ఒకరినొకరు కుశల ప్రశ్నలు కూడా వేసుకున్నారు.గతంలో ఈ ఇద్దరూ ఏ ఒక్కరోజు కూడా ఇలా కలిసి ఉండలేదు.
ఇప్పుడు కాంగ్రెస్ లో కోమటిరెడ్డి చాలా అసహనంతో ఉన్నారు.తనకు పీసీసీ ఇవ్వలేదని, పైగా రేవంత్ తో విభేదాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో ఇలా సన్నిహితంగా ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.ఒకవేళ టీఆర్ ఎస్ లోకి జంప్ చేసే ఆలోచనలో ఏమైనా ఉన్నారా.అందుకే ఇలా ఎన్నడూ లేనిది కేసీఆర్‌ను పొగుడుతున్నారా అంటూ అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ కోటమిరెడ్డి గనక టీఆర్ ఎస్‌లో చేరి నల్గొండలో టీఆర్ ఎస్‌కు తిరుగుండదు.
కేసీఆర్ కూడా కోమటిరెడ్డిని కలుపుకునిపోయినట్టు కనిపిస్తోంది.వివాదాలను పక్కన పెట్టి ఇలా ఇద్దరూ మాట్లాడుకోవడం.
పైగా ఇతర విషయాల్లో కూడా కేసీఆర్‌ను కోమటిరెడ్డి పొగడం కొంత ఆశ్చర్యమే.