నుదిటి పై వివిధ రకాల బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మహిళలు బొట్టు ధరించడం ఒక ఆచారంగా కొనసాగిస్తున్నారు.

ప్రతిరోజు స్నానమాచరించిన తర్వాత లేదా పూజా కార్యక్రమాలను ముగించుకుని మహిళలు, ముఖ్యంగా పెళ్లైన ఆడవారు నుదుటిపై తిలకాన్ని పెట్టుకుంటారు.

అయితే కొన్ని మతాలలోని స్త్రీలు ఎల్లప్పుడు నుదిటిపై తిలకాన్ని పెట్టుకోవడం ఆచారంగా వస్తోంది.అంతేకాకుండా పూజా సమయాలలో దేవతా విగ్రహాలకు కూడా ఆరాధన సూచకంగా బొట్టు పెడతారు.

అయితే కొందరు వేరువేరు రంగులతో పెట్టుకుంటారు.అలా ఎందుకు పెట్టుకుంటారు అసలు బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.

మొదట బొట్టును పెట్టుకున్న వారిని చూసినప్పుడు ఎదుటి వారిలో వారికి తెలియకుండా పవిత్ర భావనను తెలియజేస్తుంది.పూర్వకాలంలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు వివిధ రకాల వారు ఒక్కో రకమైన తిలకాన్ని నుదుటన దిద్దుకొనేవారు.

Advertisement
What Is The Meaning Behind Different Types Of Bottu On The Forehead, Kumkuma Bot

పురోహితులు లేదా శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణులు తెల్లని చందనాన్ని తిలకంగా ధరించేవారు.

What Is The Meaning Behind Different Types Of Bottu On The Forehead, Kumkuma Bot

క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియులు యుద్ధ సమయాలలో తమ వీరత్వాన్ని చాటుకునేందుకు ఎర్రటి తిలకాన్ని నుదిటి పై వీర తిలకంగా ధరించేవారు.అలాగే వైశ్య కుటుంబానికి చెందినవారు ఎక్కువగా వర్తక వ్యాపారాలు చేసే వారు కావడంతో వారి వ్యాపార అభివృద్ధికి చిహ్నంగా పసుపు రంగు కేసరితో నుదుటిపై తిలకాన్ని ధరించేవారు.అలాగే శూద్రులు నల్లటి భస్మాన్ని లేదా కాటుకను ధరించేవారు.

ఈ విధంగా ఒక్కో వంశానికి చెందిన వారు ఒక్కో రకమైన తిలకాన్ని నుదుట ధరించేవారు.మనం ఏదైనా దేవాలయాలను సందర్శించినప్పుడు భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమను ప్రసాదంగా స్వీకరించి నుదుటి పై పెట్టుకుంటారు.

అయితే ఈ బొట్టును రెండు కనుబొమ్మల మధ్య పెట్టడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.మన శరీరం మొత్తం కనుబొమ్మల మధ్య విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాల రూపంలో కేంద్రీకృతమై శక్తి వెలువడుతుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

అంతేకాకుండా బొట్టును ధరించడం వల్ల మన శరీరాన్ని వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.ఈవిధంగా భారతీయులు బొట్టును పెట్టుకోవడం ఒక ఆచారంగా భావిస్తారు.

Advertisement

అంతే కాకుండా మన భారతీయులు బొట్టు పెట్టుకోవడం ద్వారా ఎక్కడ ఉన్నా కూడా సులభంగా గుర్తుపడతారు.

తాజా వార్తలు