ఇండియా కూటమి తక్షణ కర్తవ్యం ఏమిటి ?

అధికార భాజపాను( BJP ) ఎదుర్కోవడానికి చాలా కాలంగా తృతీయ ఫ్రంట్ కోసం అనేక పార్టీలు ప్రయత్నించినప్పటికీ అధికార పంపిణీ, సీట్ల సర్దుబాటు వంటి విషయాలలో చర్చలు విఫలమై అనేక కూటములు కనుమరుగైపోయాయి అయితే ఎట్టకేలకు భాజపా ఆడుతున్న కుర్చీలాటపై విసుగు చెందిన ప్రతిపక్షాలు బాజాపా ను ఓడించి తీ రాల్సిందే అన్న కృత నిశ్చయం తో కొన్ని త్యాగాలకు సైతం సిద్ధపడుతూ కాంగ్రెస్ ను( Congress ) పెద్దన్న గా చేసి కూటమి ఏర్పాటు చేశారు.అయితే దాని విధి విధానాలు కానీ అంతర్గత సర్దుబాట్లు కానీ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాకముందే భాజపా వారికి భారీ షాక్ ఇచ్చే దిశగా ముందుకు వెళుతుంది.

 What Is The Immediate Task Of India Alliance Details, India Alliance, Nda Allian-TeluguStop.com

పార్లమెంట్ ను రద్దుచేసి ముందస్తుకు వెళుతుందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.బిజెపి తీసుకుంటున్న చర్యలు కూడా దానిని బలపరిచే విధంగానే ఉన్నాయి.

దాంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కోవాలన్నది ఇండియా కూటమికి( INDIA Alliance ) కత్తి మీద సాము లాగే మారనుంది.

Telugu Congress, India Alliance, Jamili, Narendra Modi, Nda Alliance, Rahul Gand

ఇంకా కమిటీల నిర్మాణం గానీ భవిష్యత్తు కార్యాచరణ గాని ఎన్నికల ప్రచార అస్త్రాలు గాని నిర్ణయించుకోకుండానే పులి మీద పుట్రలా ఈ ఎన్నికలు ముంచుకొస్తే ఇండియా కూటమికి శరాఘాతం గానే పరిగణించాలి.అయితే ముందస్తు ఎన్నికలు( Early Elections ) వచ్చినా కూడా తాము సిద్దంగానే ఉన్నామని ఇండియా కూటమి పైకి గంభీరంగా ప్రకటిస్తున్నప్పటికీ అంతర్గత సర్దుబాట్లు లేకుండా ఆకరి నిమిషపు హడావిడితో లాభం కంటే నష్టమే ఎక్కువ అన్నది పరిశీలకుల మాట.

Telugu Congress, India Alliance, Jamili, Narendra Modi, Nda Alliance, Rahul Gand

అయితే జమిలి ఎన్నికలు ( Jamili Elections ) అన్నది రాజ్యాంగబద్ధంగా అనేక అంశాలతో ముడిపడి ఉన్నది కాబట్టి పూర్తిస్థాయిలో జమిలీ ఎన్నికలు అన్నది ప్రస్తుతానికి సాధ్యం కాకపోయినప్పటికీ కనీసం 12 రాష్ట్రాలలో ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తే లాభ పడతామన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తుంది.మరి ఇకపై ఉన్న తక్కువ సమయాన్ని సీట్ల సర్దుబాటు, కార్యాచరణ వంటి విషయాలపై దృష్టి పెట్టి ముందుకు వెళితే తప్ప భాజాపాకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఇండియా కూటమికి ఉండదు అన్నది వార్తల సారాంశం.మరి బిజెపిఇచ్చిన షాక్ నుంచి ఇండియా కూటమి ఎంత త్వరగా సర్దుకుని ఎన్నికలకు సిద్దం అవుతుంది అన్న డాని మీదే ఇండియా కూటమి విజయవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube