రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సమంతప్రధాన పాత్రలలో డైరెక్టర్ శివ నిర్వాణ( Siva Nirvana )దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషి( Kushi ) సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ డైరెక్టర్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత ఒక పాటలో రెండుసార్లు లిప్ కిస్ సీన్లు పెట్టారు ఇది అవసరమా అంటూ ప్రశ్నించారు.

ఈ విధంగా రిపోర్టర్ ప్రశ్నించడంతో డైరెక్టర్ సమాధానం చెబుతూ.రెండుసార్లు కాదు ఒకసారి మాత్రమే షూట్ చేస్తామని డైరెక్టర్ చెప్పగా లేదు రెండుసార్లు ఉంది అంటూ రిపోర్టర్ మరోసారి చెప్పుకొచ్చారు.ఇలా రిపోర్టర్ గురించి మాట్లాడటంతో డైరెక్టర్ నవ్వుతూ అక్కడ ఉన్నది సమంత( Samantha ) కాదు ఆరాధ్య.ఆరాధ్య పాత్రలో ఉన్నటువంటి ఆమె ఈ సీన్లలో నటించారని డైరెక్టర్ చెప్పారు.
ఆరాధ్య క్యారెక్టర్ తన ప్రియుడితో కలిసి ఏడాది పాటు ట్రావెల్ చేస్తుంది.పెళ్లి తర్వాత పిల్లల కోసం తపన పడుతున్నటువంటి సమయంలో ఒక ఎమోషనల్ గా చిన్న ముచ్చట్లు లేకపోతే అసలు అర్థం ఉండదు అని తెలిపారు.

ఇలాంటి సీన్స్ లేకపోతే చూసే జనాలకు కూడా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలియదు కదా ఇలాంటి సీన్స్ జనాలకు రీచ్ అవుతాయి అంటూ ఈ ప్రశ్నకు డైరెక్టర్ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక గత కొంతకాలంగా హిట్ సినిమాలు లేక ఎంతో సతమతమవుతున్నటువంటి హీరో విజయ్ దేవరకొండకు అలాగే నటి సమంతకు కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అందించిందని చెప్పాలి.ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







